నేనే కావాలన్నాడు.. రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. ఓకే చెప్పేసా కయాదు లోహర్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

12 April 2026

తెలుగులో 'అథర్వ' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరోయిన్ కాయదు లోహర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో సెన్సేషన్‌గా మారింది ఈ బ్యూటీ..

ఆమె నటించిన లేటెస్ట్ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో 'పవళ మల్లి'  ప్రస్తుతం యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటలో తన గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ ఆకట్టుకుంటుంది. 

 అలాగే తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆమె అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. ఈ సందర్భంగా ఈ సాంగ్‌లో నటించే అవకాశం తనకు ఎలా వచ్చిందో కాయదు లోహర్ పంచుకున్నారు.

ప్రముఖ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ తెరకెక్కించిన పవళ మల్లి'లో అవకాశం రావడం పట్ల కాయదు చాలా ఎగ్జైటింగ్ గా ఫీలయైనట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఓ రోజు అర్థరాత్రి 2 గంటలకు సంగీత దర్శకుడు సాయి నుంచి నాకు కాల్ వచ్చిందని.. ఆ సమయంలో ఫోన్ చేసేసరికి కంగారుపడ్డానని.. ఏమైందని అడిగానని చెప్పుకొచ్చింది. 

తాను ఓ పాట కంపోజ్ చేశానని, చాలా బాగా వచ్చిందని చెప్పాడు. అందులో కచ్చితంగా ఉండాలని తాను నటించాలని కోరాడని.. పాట విన్న వెంటనే ఓకే చెప్పానని అన్నారు.

ఇందుకోసం 2 రోజులు నిద్రలేకుండా రిహార్సల్స్ చేశామని.. ఆడియెన్స్ కూడా పాటని ఎంజాయ్ చేస్తున్నందుకు మాకు సంతోషంగా అనిపించింది అని తెలిపింది ఈ అమ్మడు.

వెడ్డింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సాంగ్‌లో కాయదు ట్రెడిషనల్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సాంగ్ విడుదలైన కొద్ది రోజుల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించింది.