AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబై గడ్డపై కోహ్లీ విశ్వరూపం.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!

Virat Kohli record vs Mumbai Indians: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన హైవోల్టేజ్ పోరులో కోహ్లీ అరుదైన మైలురాయిని చేరుకుని, టీ20 క్రికెట్ చరిత్రలోనే ముంబైపై అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వాంఖడే స్టేడియంలో కోహ్లీ విధ్వంసానికి రికార్డులన్నీ కనుమరుగయ్యాయి.

ముంబై గడ్డపై కోహ్లీ విశ్వరూపం.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రెండు సిక్సర్లు కొడితే, అతను ఐపీఎల్‌లో 300 సిక్సర్లు కొట్టిన మూడవ బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. అంతేకాకుండా, ఈ ఘనత సాధించిన రోహిత్ తర్వాత రెండవ భారత బ్యాట్స్‌మన్‌గా కూడా నిలుస్తాడు.
Venkata Chari
|

Updated on: Apr 12, 2026 | 10:16 PM

Share

Virat Kohli record vs Mumbai Indians: ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌పై టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాటర్‌గా కోహ్లీ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు కేఎల్ రాహుల్ (977 పరుగులు) పేరిట ఉండగా, తాజా ఇన్నింగ్స్‌తో కోహ్లీ అతడిని అధిగమించాడు. శిఖర్ ధావన్ 901 పరుగులతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

37 ఏళ్ల వయసులోనూ అదే జోరు..

వయసు పెరుగుతున్నా కోహ్లీలోని పట్టుదల, పరుగుల దాహం ఏమాత్రం తగ్గలేదని ఈ మ్యాచ్ నిరూపించింది. రోహిత్ శర్మ సొంత గడ్డపై, ముంబై అభిమానుల ముందే కోహ్లీ ఈ ఘనత సాధించడం విశేషం. కేవలం ముంబైపైనే కాకుండా, చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. చెన్నైపై ఆయన ఏకంగా 1,174 పరుగులు సాధించాడు. ఇది ఒక ఐపీఎల్ జట్టుపై ఒకే ఆటగాడు చేసిన అత్యధిక పరుగులు.

వాంఖడేలో పరుగుల సునామీ..

టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ, తన భాగస్వామి ఫిలిప్ సాల్ట్‌తో కలిసి ముంబై బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. వీరిద్దరి ధాటికి బెంగళూరు జట్టు కేవలం 4.2 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది. ఇది ముంబైపై బెంగళూరుకు మూడో అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీ. పవర్ ప్లే ముగిసే సమయానికి బెంగళూరు వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.

బద్దలైన రికార్డులు.. భారీ భాగస్వామ్యం..

ఈ మ్యాచ్‌లో కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ కలిసి మొదటి వికెట్‌కు 120 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముంబై ఇండియన్స్‌పై బెంగళూరు తరపున ఇది రెండో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం. ఫిలిప్ సాల్ట్ 35 బంతుల్లో 6 సిక్సర్లతో 78 పరుగులు చేయగా, కోహ్లీ 25 బంతుల్లో 35 పరుగులు చేసి తన వంతు సహకారాన్ని అందించాడు. శార్దూల్ ఠాకూర్ ఈ జోడీని విడదీసినప్పటికీ, అప్పటికే బెంగళూరు భారీ స్కోరుకు గట్టి పునాది వేసింది.

ప్రస్తుతం కోహ్లీ ఫామ్ చూస్తుంటే ఈ సీజన్‌లో మరిన్ని రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. రన్ మెషిన్ కోహ్లీ తన బ్యాట్‌తో సమాధానం చెబుతూ, విమర్శకుల నోళ్లు మూయించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..