మేడమ్ సర్ మేడమ్.. పేరుకే సీరియల్ బ్యూటీ.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

12 April 2026

తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది ఈ అమ్మడు.

కానీ ఇప్పుడు సీరియల్స్ మానేసి సినిమాల్లో దూసుకుపోతుంది. అంతేకాదు.. ఇన్నాళ్లు స్మాల్ స్క్రీన్ పై పద్దతిగా కనిపించిన మేడమ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ గత్తరలేపుతుంది.

సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్‌ను కలిగి ఉంది. నిరంతరం తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూ నెట్టిటం పాపులర్ అయ్యింది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ జ్యోతి పుర్వాజ్. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పద్దతిగా చీరకట్టులో మెప్పించింది ఈ అమ్మడు.

కొన్నాళ్లుగా గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేసిన ఈ అమ్మడు.. తాజాగా సంప్రదాయబద్ధమైన చీరకట్టులో మెరిసింది. నీలి రంగు చీరలో ఆమె ఎంతో హుందాగా, అందంగా కనిపిస్తోంది.

ఈ చీరకు మ్యాచింగ్‌గా ఆమె ధరించిన బ్లౌజ్, సింపుల్ జ్యువెలరీ ఆమె లుక్‌ను మరింత ఎలివేట్ చేశాయి. ఆమె కళ్ళలో ఉన్న మెరుపు, చిరునవ్వు అభిమానులను కట్టిపడేస్తున్నాయి.

జ్యోతి పూర్వాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫోటోలను పోస్ట్ చేసిన కొద్ది సేపటికే అవి వైరల్‌గా మారాయి. చీరకట్టులో తెలుగు అమ్మాయి అందం చూడతరమా కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు ఆమెను 'బ్లూ ఏంజెల్' అని పిలుస్తుంటే, మరికొందరు ఆమె ఫిట్‌నెస్‌ను, ఫ్యాషన్ సెన్స్‌ను ప్రశంసిస్తున్నారు. కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా లుక్స్ ద్వారా కట్టిపడేస్తుంది.