AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jai Bolo Telangana Movie: జై బోలో తెలంగాణ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే షాకవ్వడం ఖాయమే..

మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ అందించిన సంగీతం ఆల్ టైమ్ సూపర్ హిట్ అనే చెప్పాలి. 2009లో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన అల్లకల్లోలమైన రోజులు, పోలీసుల లాఠీ ఛార్జీ నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం స్టూడెంట్స్ ఆత్మహత్యలు, యదార్థ సంఘటనలను కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా అప్పట్లో ఐదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులను గెలుచుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‏గా నటించిన మీరా నందన్ సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Jai Bolo Telangana Movie: జై బోలో తెలంగాణ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే షాకవ్వడం ఖాయమే..
Meera Nandan
Rajitha Chanti
|

Updated on: Jun 25, 2024 | 10:30 AM

Share

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో సంచలనం సృష్టించిన సినిమా జై బోలో తెలంగాణ. 2011లో విడుదలైన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా మ్యూజికల్ హిట్‏గా నిలిచింది. తెలంగాణ ఉద్యమం ఆధారంగా చేసుకుని డైరెక్టర్ ఎన్. శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రానికి టి. సురేంద్రరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. ఇందులో విలక్షణ నటుడు జగపతి బాబు, స్మృతి ఇరానీ, మీరా నందన్, సందీప్ సింగ్ కీలకపాత్రలు పోషించారు. ఇక దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ అందించిన సంగీతం ఆల్ టైమ్ సూపర్ హిట్ అనే చెప్పాలి. 2009లో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన అల్లకల్లోలమైన రోజులు, పోలీసుల లాఠీ ఛార్జీ నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం స్టూడెంట్స్ ఆత్మహత్యలు, యదార్థ సంఘటనలను కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా అప్పట్లో ఐదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులను గెలుచుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‏గా నటించిన మీరా నందన్ సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అందమైన చూడచక్కని రూపం.. అచ్చ తెలుగు అమ్మాయిలగా సంప్రదాయంగా కనిపిస్తూ సహజ నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది మీరా నందన్. 1990 నవంబర్ 26న కేరళలోని కొచ్చి ప్రాంతంలో జన్మించిన మీరా నందన్.. జర్నలిజం కంప్లీట్ చేసింది. ఆ తర్వాత మోహన్ లాల్ టేస్ట్ బడ్స్ కోసం ఓ ప్రకటనలో నటించింది. ఆ తర్వాత 2007లో ఆమె ఐడియా స్టార్ సింగర్ పోటీలో పాల్గొంది. ఈషోకు యాంకర్ గా పనిచేసిన మీరా నందన్.. బుల్లితెరపై యాంకరింగ్ ద్వారా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత 2007లో మలయాళంలో వచ్చిన ముల్లా సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది. ఆమె తల్లిదండ్రులు మలయాళీ నటి దివ్య ఉన్నికి బంధువు అవుతారు.

ఇక 2011లో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆమె నటనకు తెలుగు అడియన్స్ ఫిదా అయ్యారు. తన అధ్బుతమైన నటనతో ప్రేక్షకుల మనసులు దొచుకుంది. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా నటించింది మీరా నందన్. గతేడాది ప్రముఖ వ్యాపారవేత్తను శ్రీజును వివాహం చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది మీరా నందన్. సినిమాలకు దూరంగా ఉన్న మీరా నందన్ నిత్యం నెట్టింట ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు