Tollywood: ఆర్మీ ఆఫీసర్‌తో పెళ్లి.. సినిమాలు మానేసి జ్యోతిష్యం చెబుతోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరంటే?
ముంబైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ ఫుడ్ సైన్స్, కెమిస్ట్రీలో గ్రాడ్యుయేట్ చేసింది. ఆతర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టి ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. అటుపై సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టింది. తన అందం, అభినయంతో ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది.

గతంలో సినిమాల్లో నటించి తెరమరుగైన అందాల తారలు ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ అంటూ సహాయక నటి పాత్రల్లో మెరుస్తున్నారు. అయితే గతంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన కొందరు ముద్దుగుమ్మలు ఇప్పుడు బిజినెస్ లో సత్తా చాటుతున్నారు. వివిధ వ్యాపారాలతో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ అందాల తార కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించిన ఈ సొగసరి చివరిగా 2015లో ఓ సినిమాలో కనిపించింది. అంతే ఆ తర్వాత మరే మూవీ కానీ, కనీసం సీరియల్స్ లో కానీ కనిపించలేదు. అయితే ఇప్పుడీ బ్యూటీ బిజినెస్ లో దూసుకుపోతోంది. ఒకటి కాదు రెండు కాదు పలు వ్యాపారాలు నిర్వహిస్తూ బిజి బిజీగా ఉంటోంది. ఓ కన్సల్టింగ్ కంపెనీని నడుపుతోన్న ఆమె అస్ట్రాలజర్ కూడా. వేద జ్యోతిషం, లైఫ్ స్టైల్ కన్సల్టేషన్ గురించి సోషల్ మీడియాలో తరచూ వీడియోలు షేర్ చేస్తోంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా? తులిప్ జోషి. తెలుగు ఆడియెన్స్ కు ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు.. కానీ.. బాలీవుడ్ లో ఈ బ్యూటీకి మంచి గుర్తింపు ఉంది.
2002లో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ‘మేరే యార్ కీ షాదీ హై’ అనే సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది తులిప్ జోషి. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీని తర్వాత ‘మాతృభూమి’, ‘దిల్ మాంగే మోర్’ తదితర సినిమాల్లో నటించింది కానీ. స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. దీంతో దక్షిణాదిలో అదృష్టం పరీక్షించుకుంది. రాజశేఖర్ నటించిన విలన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త కొత్తగా అనే మూవీలోనూ ఓ కీలక పాత్ర పోషించింది. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. సల్మాన్ 2014లో హీరోగా నటించిన జయహో అనే సినిమాలో చివరిగా కనిపించింది తులిప్ జోషి.
తులిప్ జోషి లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
తులిప్ జోషి వినోద్ నాయర్ అనే ఒక ఆర్మీ ఆఫీసర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 1989 నుంచి 1996 వరకు పంజాబ్ రెజిమెంట్‌లో కమీషన్డ్ ఆఫీసర్‌గా వినోద్ నాయర్ సేవలు అందించారు. ఇక సినిమాలకు దూరమైన తులిప్ జోషి బిజినెస్ ఉమెన్‌గా మారింది. తన భర్త వినోద్ నాయర్‌తో కలిసి ‘కిమ్మయా కన్సల్టింగ్’ అనే ఒక కంపెనీని నడుపుతోంది. దీంతో పాటు పలు బిజినెస్ లు చేస్తూ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార.
విలన్ సినిమాలో రాజశేఖర్, తులిప్ జోషి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







