Kalyan Ramudu: కళ్యాణ రాముడు హీరోయిన్ గుర్తుందా ?.. కథలో రాజకుమారి ఇప్పుడు ఎలా ఉందంటే..
దివంగత డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ కుమారుడు ఆర్యన్ రాజేష్ నటించిన హాయ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నిఖిత. ఈ సినిమా తర్వాత నితిన్ హీరోగా నటించిన సంబరం చిత్రంలో కనిపించింది.

సాధారణంగా చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే చిత్రపరిశ్రమకు దూరమవుతుంటారు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని నటనకు ప్రశంసలు అందుకున్నప్పటికీ అవకాశాలు అందుకోవడంలో వెనకబడిపోతుంటారు. అలా కొన్ని సినిమాల్లోనే నటించి తెలుగు చిత్రపరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఒకటి రెండు చిత్రాల్లో కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. అలాంటి వారిలో హీరోయిన్ నిఖిత ఒకరు. దివంగత డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ కుమారుడు ఆర్యన్ రాజేష్ నటించిన హాయ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నిఖిత. ఈ సినిమా తర్వాత నితిన్ హీరోగా నటించిన సంబరం చిత్రంలో కనిపించింది.
ఆ తర్వాత డైరెక్టర్ జి.రాంప్రసాద్ దర్శకత్వంలో వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన కళ్యాణ రాముడు సినిమాలో కనిపించింది.. 2003లో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సుమన్, నాజర్, ప్రభు దేవా, రాజా రవీంద్ర కీలకపాత్రలలో నటించగా.. మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ శ్రోతలను ఆకట్టుకుంటాయి. ఇందులో వేణుకు జోడిగా హీరోయిన్ నిఖిత నటించింది. ఈ సినిమా ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పుకొవాలి.




కళ్యాణ రాముడు చిత్రం తర్వాత ఖుషి ఖుషీగా, అనసూయ, డాన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు నిఖిత. వరుస చిత్రాలు చేస్తున్న సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు నిఖిత. 2017లో పంజాబ్ కు చెందిన గగన్ దీప్ సింగ్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది నిఖిత. వీరికి ఓ పాప జన్మించింది. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది నిఖిత. నిత్యం తన కూతురితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.