Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో
పై ఫొటోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఉన్న ఈ పిల్లాడిని గుర్తుపట్టారా? చూడ్డానికి ఎంతో క్యూట్‌గా, చబ్బీగా ఉన్నాడు కదా. తెలుగు సినిమాలు చూసే వారు కొంచెం కష్టమైనా ఈ పిల్లాడు ఎవరో గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే ఈ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. అమ్మాయిల కలల రాకుమారుడు. యూత్‌లో మంచి క్రేజ్ ఉంది.
పై ఫొటోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఉన్న ఈ పిల్లాడిని గుర్తుపట్టారా? చూడ్డానికి ఎంతో క్యూట్‌గా, చబ్బీగా ఉన్నాడు కదా. తెలుగు సినిమాలు చూసే వారు కొంచెం కష్టమైనా ఈ పిల్లాడు ఎవరో గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే ఈ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. అమ్మాయిల కలల రాకుమారుడు. యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇతను తాత, తండ్రుల వారసత్వాన్ని కొనసాగించేందుకు గట్టిగా కృషి చేస్తున్నాడు. అయితే పెద్దగా విజయాలు మాత్రం దక్కడం లేదు. 2015లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతను ఈ ఎనిమిదేళ్లలో సుమారు ఆరు సినిమాలు చేశాడు. అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోదగ్గ సినిమా లేదు. అయితేనేం ఈ హీరోకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఒక్క హిట్ పడితే స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోతాడంటున్నారు ఫ్యాన్స్. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. పై ఫొటోలో జూనియర్‌తో ఎన్టీఆర్‌తో ఉన్నది మరెవరో కాదు టాలీవుడ్ యువ సామ్రాట్ అఖిల్ అక్కినేని.
ఫై ఫొటో సాంబ సినిమా షూట్‌లో దిగినట్లు తెలుస్తోంది. అప్పుడు ఎన్టీఆర్ ఎంతో బొద్దుగా ఉన్నాడు. అ సమయంలో అఖిల్ వయసు సుమారు పదేళ్లని తెలుస్తోంది. సిసింద్రీ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన అఖిల్ 2015లో అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హలో తో మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మిస్టర్ మజ్ఞు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో రొమాంటిక్ హీరోగా మారిపోయాడు. అయితే ఏజెంట్ డిజాస్టర్ కావడంతో కాస్త వెనకడుగు వేసినట్లు అయ్యింది. ఈ ఏడాది ప్రారంభంలో రిలీజైన ఈ సినిమా అఖిల్ అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చింది. అయితేనేం అయ్యగారు మళ్లీ ఈసారి ఏకంగా 100 కోట్ల సినిమాతో మనల్ని పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.
ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో అఖిల్ అక్కినేని..
View this post on Instagram
అక్కినేని నాగార్జున, అమలతో అఖిల్..
View this post on Instagram
చివరిగా ఏజెంట్ సినిమాలో కనిపించిన అఖిల్ అక్కినేని..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..