AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shiva Movie: విలన్‌గా మోహన్‌బాబును రిజెక్ట్ చేసిన ఆర్జీవీ.. ఎందుకో తెలుసా?

ఆర్జీవీకి కూడా మొదటి సినిమా అవడంతో ఎలాంటి హడావిడిగా ‘శివ’ సినిమా విడుదలైంది. కానీ మౌత్‌ టాక్‌తో బ్లాక్‌బస్టర్‌‌గా మారి నిర్మాత అక్కినేని వెంకట్​ను ఆశ్చర్యపరిచింది. నాగార్జున మాత్రం ఆర్జీవీ మీద పూర్తి నమ్మకంతో ‘శివ’ కథను ఒప్పుకున్నారు. ఇళయరాజా సంగీతం, రామ్ గోపాల్ వర్మ టేకింగ్, ఆకట్టుకునే కథనం.. అన్నీకలిసి ట్రెండ్ని సెట్ చేశాయి.

Shiva Movie: విలన్‌గా మోహన్‌బాబును రిజెక్ట్ చేసిన ఆర్జీవీ.. ఎందుకో తెలుసా?
Rgv & Mohanbabu
Nikhil
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 12, 2025 | 10:53 PM

Share

మొదటి సినిమాతోనే సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ రామ్​గోపాల్ వర్మ. ఆర్జీవీ డైరెక్షన్లో 1989 అక్టోబర్ 5న విడుదలైన ‘శివ’ టాలీవుడ్ చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది. అక్కినేని నాగార్జున, అమల హీరోహీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజై బ్లాక్​బస్టర్ హిట్​గా నిలిచింది. అప్పటికి ఇంకా నాగార్జున కూడా హీరోగా పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు.

ఆర్జీవీకి కూడా మొదటి సినిమా అవడంతో ఎలాంటి హడావిడిగా ‘శివ’ సినిమా విడుదలైంది. కానీ మౌత్‌ టాక్‌తో బ్లాక్‌బస్టర్‌‌గా మారి నిర్మాత అక్కినేని వెంకట్​ను ఆశ్చర్యపరిచింది. నాగార్జున మాత్రం ఆర్జీవీ మీద పూర్తి నమ్మకంతో ‘శివ’ కథను ఒప్పుకున్నారు. మొదటి రోజు ఉదయం షోకు 30 శాతం కూడా ఆక్యుపెన్సీ లేదు, కానీ రెండు షోల తర్వాత ప్రేక్షకులు పోటెత్తారు. సాయంత్రానికి థియేటర్లు హౌస్‌ఫుల్, బయ్యర్లు మరిన్ని థియేటర్లు కావాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కినేని నాగేశ్వరరావు, వెంకట్ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నించారు.

‘శివ’ సినిమా మంచి వసూళ్లు రాబట్టడమే కాదు, తెలుగు సినిమాకే మార్గదర్శకంగా మారింది. ఇళయరాజా సంగీతం, రామ్ గోపాల్ వర్మ టేకింగ్, ఆకట్టుకునే కథనం.. అన్నీకలిసి ట్రెండ్ని సెట్ చేశాయి. 1990లో హిందీలోనూ ‘శివ’ సినిమాను రీమేక్ చేశారు. ఈ సినిమా నాగార్జునకు స్టార్ ఇమేజ్, వర్మకు దర్శకుడిగా మంచి గుర్తింపునిచ్చింది. అక్టోబర్ 5, 2025 నాటికి ‘శివ’ సినిమా రిలీజై 36 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా 4కే క్వాలిటీతో నవంబర్ 14న రీరిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో నాగార్జున, ఆర్జీవీ పాల్గొని ‘శివ’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు.

ఈ సినిమాలో హీరోకి సమాన ప్రాధాన్యం ఉన్న పాత్ర గణేష్. శివ-గణేష్ ఎదురుపడే సన్నివేశాలు సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. గణేష్ పాత్రలో విశ్వనాథ్ నటించారు. కానీ ఈ పాత్రకు ముందుగా నిర్మాత వెంకట్ మోహన్బాబుని అనుకున్నారట. అప్పటికే వరుస హిట్లతో ఫామ్లో ఉన్న మోహన్‌బాబు ఆ పాత్ర పోషిస్తే సినిమాకి బాగా కలిసొస్తుందని నమ్మారట.

శివకు వార్నింగ్ ఇచ్చే రౌడీగా మోహన్ బాబు సరిగ్గా సరిపోతారని, మోహన్ బాబుతోనే గణేష్ పాత్ర చేయించాలని పట్టుబట్టారట. కానీ ఆర్జీవీ మాత్రం ‘మోహన్ బాబు వస్తే ప్రేక్షకులు పాత్రను కాకుండా నటుడినే చూస్తారు. కథా బలం తగ్గుతుంది. కొత్త ముఖం వస్తే రౌడీగా పూర్తిగా అంగీకరిస్తారు’ అని లాజికల్‌గా వివరించి అందరినీ ఒప్పించారట. అప్పుడే ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన విశ్వనాథ్‌ను ఎంచుకున్నారు. ఈ నిర్ణయం చిత్రానికి బలంగా మారిందనడంలో ఏ అనుమానం లేదు. రఘువరణ్ (బడే) పాత్రతో కలిసి గణేష్ కూడా చిరస్థాయిగా నిలిచింది.

రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్