AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : వెంకటేశ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్.. కెరీర్ పీక్స్‏లో ఉండగానే సినిమాలకు గుడ్ బై.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..

భారతీయ సినిమా ప్రపంచంలో టాప్ హీరోయిన్. ఒకప్పుడు తెలుగులో చక్రం తిప్పింది. వెంకటేశ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక హిట్ మూవీస్ చేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరు.. ఏం చేస్తుందో తెలుసుకుందామా.

Actress : వెంకటేశ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్.. కెరీర్ పీక్స్‏లో ఉండగానే సినిమాలకు గుడ్ బై.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..
Preity Zinta
Rajitha Chanti
|

Updated on: Nov 12, 2025 | 10:35 PM

Share

సినీరంగంలో అత్యంత ప్రియమైన నటీమణులలో ఆమె ఒకరు. స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసింది. తెలుగు, హిందీ భాషలలో వరుస హిట్ చిత్రాలతో చక్రం తిప్పింది. కానీ తన కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో చిత్ర పరిశ్రమకు దూరమై అందరినీ ఆశ్చర్యపరిచింది. తన చిరునవ్వు, ఆకర్షణీయమైన కళ్ళు, అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఆమె ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. ఆమె మరెవరో కాదు.. ప్రితీ జింటా. 2000లలో తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో చాలా పాపులర్ ఉన్న హీరోయిన్.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అప్పుడు ప్రియురాలిగా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్.. చిరుతో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..

మహేష్ బాబుతో రాజకుమారుడు, వెంకటేశ్ తో ప్రేమంటే ఇదేరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ చేసింది. అలాగే హిందీలో “కల్ హో నా హో”, “వీర్ జారా”, “సలాం నమస్తే” వంటి చిత్రాలు స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఇండస్ట్రీకి దూరమయ్యింది. సినిమా పరిశ్రమను విడిచిపెట్టిన తర్వాత, ప్రీతి వ్యాపార ప్రపంచం వైపు మళ్లింది. 2008లో IPL జట్టు పంజాబ్ కింగ్స్‌కు సహ యజమానిగా రూ.35 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఆ పెట్టుబడి విలువ రూ.250 కోట్లు. నివేదికల ప్రకారం, జట్టు మొత్తం విలువ ఇప్పుడు $925 మిలియన్లు.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..

ఆమెకు ముంబైలోని పాలి హిల్స్‌లో రూ.17 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్, సిమ్లాలో రూ.7 కోట్ల విలువైన ఇల్లు ఉన్నాయి. ఆమె తన భర్త జీన్ గూడెనఫ్‌తో కలిసి ఇమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో స్థిరపడింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వ్యాపారరంగంలో బిజీగా ఉంటుంది.

Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‏బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz)

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..