AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంలో అప్సరస..! 16 సినిమాలు చేస్తే 7 హిట్స్‌..!! ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

ఆమె అందం చూస్తే ఫిదా కానీ కుర్రాడు ఉండడు. కోకిలలాంటి వాయిస్, కవ్వించే రూపం, ఆకట్టుకునే నటన ఈ ముద్దుగుమ్మ సొంతం. తన టాలెంట్ తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. మల్టీటాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా..?

అందంలో అప్సరస..! 16 సినిమాలు చేస్తే 7 హిట్స్‌..!! ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 14, 2026 | 1:19 PM

Share

తెలుగులో ఎంతో మంది హీరోయిన్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. తమ అందంతో అభినయంతో మెప్పించిన ముద్దుగుమ్మల్లో ఈ అమ్మడు ఒకరు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కేవలం నటనతోనే కాదు సింగర్ గానూ అలరించింది. సింగర్ గా సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. తెలుగులో ఈ అమ్మడు 16 సినిమాలు చేసింది. అన్ని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 16 సినిమాలు చేస్తే దాదాపు 7 సినిమాలు హిట్ గా నిలిచాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు.

అప్పట్లో ఊపేసింది..! 90’s కిడ్స్ ఫేవరెట్ యాంకర్.. ఈ అమ్మడు గుర్తుందా.?

ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఇంతకూ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన ఈ చిన్నది మరెవరో కాదు ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది నిత్యా అంతకు ముందు తమిళ్ లో పాలు సినిమాలు చేసి మెప్పించింది. ఇష్క్, ఒక్కడినే,జబర్దస్త్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఒక్క అమ్మాయి తప్ప,జనతా గ్యారేజ్, అ!, గీత గోవిందం,ఎన్.టి.ఆర్. కథానాయకుడు, నిన్నిలా నిన్నిలా,గమనం, స్కైలాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో మెప్పించింది నిత్యామీనన్.

ఇవి కూడా చదవండి

ఎదురు కట్నమైనా ఇస్తా..! అమ్మాయిలో అలాంటి క్వాలిటీస్ ఉండాలి : జబర్దస్త్ నరేష్

తెలుగులో స్ట్రయిట్ గా చేసిన చివరిగా భీమ్లానాయక్ సినిమాతో మెప్పించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా నటించింది నిత్యా. అలాగే పలు టీవీ షోల్లోనూ కనిపించింది. అలాగే తెలుగు ఇండియన్ ఐడల్ కు జడ్జ్ గా ను చేసింది. తిరుచిత్రంబలం సినిమాకు నేషనల్ అవార్డు కూడా అందుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం విజయ్ సేతుపతితో సినిమా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిత్యా.. తన ఫొటోలతో  అభిమానులను ఆకట్టుకుంటుంది. నిత్య తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.

గూగుల్ నన్ను హిందువుని చేసింది.. కానీ నేను ముస్లిం అమ్మాయిని.. షాక్ ఇచ్చిన సీరియల్ బ్యూటీ

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి