AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు నటి.. పెళ్ళైన 15 రోజులకే కనిపించకుండాపోయిన భర్త.. పాపం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా

సమాజం చాలా మారిపోయింది భయ్యా.. ఇప్పుడు ఎక్కడ చూసినా లవ్ స్టోరీలు, బ్రేకప్ లు, ఎఫైర్స్, పెళ్లి, విడాకులు ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి.. ఇవన్నీ చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి. కానీ సెలబ్రెటీల విషయంలో జరిగితే మాత్రం అది వార్తే.. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్. జనాలు సెలబ్రెటీల లైఫ్ లో జరిగే ప్రతి దాని పై ఓ కన్నేసి ఉంటారు.

ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు నటి.. పెళ్ళైన 15 రోజులకే కనిపించకుండాపోయిన భర్త.. పాపం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా
Actress
Rajeev Rayala
|

Updated on: May 19, 2025 | 9:33 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్ లు, విడాకులు ఇలాంటివి తొవ్వే కొద్దీ వస్తూనే ఉంటాయి. చాలా మంది సెలబ్రెటీలు ఈ మధ్య కాలంలో విడిపోయిన వార్తలు మనం వింటూనే ఉన్నాం. స్టార్ కపుల్స్ కూడా సింపుల్ గా సోషల్ మీడియాలో అనౌన్స్ చేస్తున్నారు. అభిమాన హీరోలు, హీరోయిన్స్ విడిపోతున్నట్టు అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. దాంతో చాలా మంది సినీ సెలబ్రెటీల పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో పెద్దెఎత్తున చర్చ జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ గురించి, ఆమె వ్యకిగత జీవితం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఓ స్టార్ హీరోయిన్.. పెళ్లి అయిన 15 రోజుల తర్వాత ఆమె భర్త కనిపించకుండా మాయం అయ్యాడు. ఆతర్వాత ఆమె ఇండస్ట్రీ నుంచి కనిపించకుండా పోయింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : గోవిందుడు అందరివాడేలేలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు చూస్తే చెక్ అవ్వాల్సిందే..

తమిళ్ సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి దేవిక. ఈ సీనియర్ నటి కూతురు కనక కూడా సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. కనక తన నటనా జీవితాన్ని 1989లో తమిళ చిత్రం “కరకట్టక్కరన్” తో ప్రారంభించింది. గంగై అమరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఊహించని విధంగా  ఏడాదికి పైగా థియేటర్లలో ఆడింది ఈ సినిమా. తెలుగులో కూడా ఆమె కొన్ని చిత్రాలలో నటించింది. కానీ తమిళ, మలయాళ చిత్రాలలోనే ఆమె ఎక్కువగా ప్రసిద్ధి చెందింది.

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా..! ఈ ఫొటోలో స్కూల్ డ్రస్ వేసుకున్న రెండు జెళ్ళ పాప గుర్తుందా.? ఇప్పుడెలా ఉందంటే

ఆమె రజనీకాంత్, విజయకాంత్, ప్రభు, కార్తీక్, అర్జున్, మరియు శరత్ కుమార్ వంటి అగ్రశ్రేణి నటులతో కలిసి పనిచేసింది. ఆమె 10 సంవత్సరాల వ్యవధిలో 50కి పైగా చిత్రాలలో నటించింది. కనకకు 3 ఏళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. అప్పటి నుంచి ఆమె తన తల్లితోనే పెరిగింది. సినిమాల్లో రాణించిన కనక వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. 2007లో, కనక కాలిఫోర్నియాకు చెందిన మెకానికల్ ఇంజనీర్ ముత్తు కుమార్‌ను వివాహం చేసుకుంది. కానీ పెళ్లైన ఆమె భర్త 15 రోజులకే కనిపించకుండా పోయాడు. ఆమె భర్తను కొంతమంది సినిమా ఫైనాన్సర్లు కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించింది. ఆతర్వాత ఆమె సినిమాల నుంచి మాయం అయ్యింది. 2002 తర్వాత కనక సినిమా రంగం నుండి పూర్తిగా దూరమై, చెన్నైలోని తన ఇంటిలో ఒంటరిగా జీవిస్తోంది. అయితే కనక చనిపోయిందని వార్తలు వచ్చాయి.. కానీ అవన్నీ రూమర్స్ అని తెలుస్తుంది. 2023లో నటి కుట్టి పద్మిని కనకతో కలిసిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ ఫొటోలో ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

ఇది కూడా చదవండి : సీన్ సీన్‌కు సితారే..! దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన సినిమా మావ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

Actress Kanaka

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి