సీన్ సీన్‌కు సితారే..! దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన సినిమా మావ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా మంది భయపెట్టె దెయ్యాల సినిమాలు చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎలాంటి హారర్ సినిమాలు వచ్చిన వదిలిపెట్టకుండా చూస్తుంటారు. మరికొంతమంది భయమేసిన కళ్లు మూసుకుంటునైనా సినిమాను చూస్తూ ఉంటారు. ఓటీటీలో భయపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి.

ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లలో కొన్నాళ్లుగా హారర్ కంటెంట్ చిత్రాలు అధికంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, ఆసక్తిని రేకెతెత్తించే వెబ్ సిరీస్ నిత్యం సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా హారర్ జోనర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓటీటీల్లో హారర్ సినిమాలు చూసేవారి సంఖ్య కూడా ఎక్కువే. అందులోనూ దెయ్యం కాన్సెప్ట్‌తో వచ్చే స్టోరీలు అయితే.. మూవీ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తారు. మరి దెయ్యంతో పాటు కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే.. అలాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఒకటి ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ అసలేంటి.? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం..!
ఈ సినిమా హారర్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో సీన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సినిమాను ఒంటరిగా చూడకపోవడమే బెటర్. ఈ సినిమా ఓ మంత్రగత్తె సైనికుల పై పగతీర్చుకునే కథతో తెరకెక్కింది. సామాన్యుల మీద కాకుండా ఆ మంత్రగత్తె సైనికుల మీద ఎందుకు పగబట్టింది. ఎందుకు వారిని క్రూరంగా చెపుతుంది అనేది సినిమాలో చూడాల్సిందే. ఉక్రెయిన్‌లోని యుద్ధ నేపథ్యంలో జరిగే హారర్ మూవీ ఇది. సినిమా కథ ఎంతో ఆస్కతికరంగా ఉంటుంది. అలాగే సీన్ సీన్ కు వెన్ను వణుకుతుంది. ఇంతకూ ఈ సినిమా పేరు ఏంటా అనుకుంటున్నారా.?
ది విచ్: రివేంజ్.. 2024లో విడుదలైన ఒక డ్రామా, ఫాంటసీ, హారర్ సినిమా ఇది. దీనిని ఆండ్రీ కొలెస్నిక్ దర్శకత్వం వహించారు. కథలో, కొనోటోప్ నుండి ఒక మంత్రగత్తె తన కాబోయే భర్తను చంపిన రష్యన్ సైనికులపై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఆండ్రజెజ్ సప్కోవ్స్కీ రాసిన పుస్తకాల ఆధారంగా దీనిని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రస్తుతం రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. జియో హాట్‌స్టార్‌లో కేవలం హిందీ భాషలో ది విచ్ రివేంజ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఏకంగా నాలుగు భాషల్లో అందుబాటులో ఉంది. ఈ హారర్ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








