కాలు తొక్కినందుకు నన్ను సినిమా నుంచే తీసేయమని బాలకృష్ణ సీరియస్ అయ్యారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 60 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో కుర్ర హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తున్నారు బాలయ్య. ఒక్కో సినిమాకు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ.. నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు.

ఒకప్పుడు హీరో, హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అవుతున్నారు చాలా మంది. కొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కొంతమంది సెకండ్ హీరోయిన్స్ గా చేస్తుంటే మరికొంతమంది మాత్రం అమ్మ, వదిన, అక్క పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక చాలా కాలం తర్వాత ఇప్పుడు ఓ హీరోయిన్ కూడా తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది ఆమె. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇక ఇప్పుడు తిరిగి ఓ యంగ్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. అంతే కాదు ఆ సినిమాలో ఆమె హీరో అక్క పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..
ఒకప్పుడు తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న భామల్లో లయ ఒకరు. స్కిన్ షోకు ఎక్కడా తావులేకుండా కేవలం తన నటనతోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తుంది ఈ అమ్మడు. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో లయ కీలక పాత్రలో నటిస్తున్నారు. నితిన్ కు అక్కగా నటిస్తున్నారు లయ.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ఆసక్తికర కామెంట్ చేసింది. బాలకృష్ణ తన పై సీరియస్ అయ్యారని తెలిపింది లయ. విజయంద్రవర్మ సినిమాలో లయ బాలకృష్ణతో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ తన పై సీరియస్ అయ్యారని తెలిపింది. అయితే సీన్ రిహార్సిల్స్ సమయంలో చూసుకోకుండా బాలకృష్ణ కాలును తొక్కేశాను.. దాంతో బాలకృష్ణ గారు వెంటనే నా కాలు తక్కుతావా.? ప్యాకప్.. ఈ అమ్మాయిని తీసేయండి అని సీరియస్ అయ్యారు. దాంతో నాకు ఏడుపొచ్చేసింది.. అక్కడి నుంచి వెళ్ళిపోయా.. దాంతో బాలకృష్ణగారు అయ్యో ఆ అమ్మాయి ఏడ్చేస్తుంది.. వెళ్లి ఆమెను ఆపేయండి.. నేనేదో సరదాగా అన్నాను నిజమనుకున్నావా.? ఇలాంటివి నేను బోలేడంటాను అని నవ్వేశారు. బాలకృష్ణ గారు సెట్ లో ఎంతో సరదాగా ఉంటారని తెలిపింది లయ ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.