AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..! చిరంజీవి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్..

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి హిట్ తర్వాత చిరంజీవి నటించిన బోళాశంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు అభిమానులంతా విశ్వంభర సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..! చిరంజీవి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్..
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: May 13, 2025 | 2:40 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చిరంజీవి చివరిగా నటించిన భోళాశంకర్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మెహారమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు అభిమానులంతా విశ్వంభర సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ సైతం కనిపించనుందని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే శ్రీ రామనవమి రోజున ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు చిరు కొత్త సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార సినిమాతో వశిష్ట మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి సోషియో ఫాంటసీ కథతో చిరంజీవి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ కనిపించనున్నారని తెలుస్తుంది. అలాగే ఓ అందాల భామ మెగాస్టార్ చిరంజీవి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. చేసింది కొన్ని సినిమాలే అయినా తన అందంతో నటనతో ఆకట్టుకుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ చిరంజీవి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న బ్యూటీ ఎవరో కాదు ప్రేమకావాలి సినిమాతో పరిచయమైన ఇషా చావ్లా. ఆదిసాయి కుమార్ హీరోగా నటించిన ప్రేమకావాలి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ ఇషా చావ్లా. తొలి సినిమాతోనే ఈ చిన్నది మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. అయితే ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో కనుమరుగైంది. చాలా కాలం పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది.

View this post on Instagram

A post shared by Esha Chawla (@eshachawla63)

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి. 

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!