AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగ చైతన్యకు పక్కన ఫ్రెండ్‌గా చేశాడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరో.. అతను ఎవరంటే

అక్కినేని అందగాడు నాగ చైతన్య రీసెంట్ గా తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా యదార్ధ ఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగ చైతన్య మత్యకారుడిగా నటించి ఆకట్టుకున్నాడు. చైతూకు జోడీగా సాయి పల్లవి నటించి మెప్పించింది. దేవీ శ్రీ సంగీతం అందించిన తండేల్ సినిమా మ్యూజిక్ పరంగానూ మంచి విజయాన్ని అందుకుంది.

నాగ చైతన్యకు పక్కన ఫ్రెండ్‌గా చేశాడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరో.. అతను ఎవరంటే
Naga Chaitanya
Rajeev Rayala
|

Updated on: May 12, 2025 | 12:12 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కష్టపడి పైకి వచ్చినవారే.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటివారిలో పైన కనిపిస్తున్న హీరో ఒకరు. చిన్న చిన్న పాత్రల నుంచి ఎదిగి ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ హీరోగా మారాడు. హీరోల పక్కడ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ.. ప్రేక్షకులకు పరిచయమైనా అతను.. ఇప్పుడు వర్సటైల్ యాక్టర్ గా రాణిస్తున్నాడు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక మరో విశేషం ఏంటంటే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య పక్కన ఫ్రెండ్ గా నటించిన అతను.. ఆతర్వాత హీరోగా మారి చై కంటే ఎక్కువ సినిమాలు చేశాడు. ఇంతకూ అతను ఎవరో గుర్తుపట్టారా.? వైవిధ్యమైన కథలకు అతను కేరాఫ్ అడ్రస్.

చాలా మంది నటీనటులు షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తే సుహాస్. సినిమాల్లోకి రాక ముందుసుహాస్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మెప్పించాడు. ఇక శర్వానంద్ హీరోగా నటించిన పడి పడి లేచే మనసు సినిమా ద్వారా సినిమాల్లోకి వచ్చాడు. ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించాడు. ఆతర్వాత నాగ చైతన్య నటించిన మజిలీ సినిమాలోనూ హీరో ఫ్రెండ్ పాత్రలోనే కనిపించాడు.

ఇక సుహాస్ హీరోగా నటించిన మొదటి సినిమా కలర్ ఫోటో. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఈ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. కాగా సుహాస్ నాగ చైతన్యతో ఫ్రెండ్ పాత్రలో నటించాడు. ఇప్పుడు చైతన్య కంటే సుహాస్ ఎక్కువ సినిమాల్లో నటిస్తున్నాడని నెట్టింట టాక్ వినిపిస్తుంది. నాగ చైతన్య ఇప్పటివరకు 25 సినిమాలు చేయగా సుహాస్ ఇప్పటికే 24 సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలను కూడా లైనప్ చేసి బిజీగా ఉన్నాడు.  ఇటీవల జనకా అయితే గనక, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో నటించాడు. అలాగే సుహాస్ నటించిన గొర్రె పురాణం సినిమా కూడా ఓటీటీలో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఓ తమిళ్ సినిమాలో నటిస్తున్నాడు.

View this post on Instagram

A post shared by Suhas (@suhassssssss)

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే