AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన కల్యాణ్ రామ్, విజయశాంతి లేటెస్ట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

గత వారంలో దాదాపు 30 కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చాయి. వీటిలో ఓదెల 2, గుడ్ బ్యాడ్ అగ్లీ, జాక్ వంటి ఆసక్తిర సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త తెలుగు సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే.

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన కల్యాణ్ రామ్, విజయశాంతి లేటెస్ట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Arjun Son Of Vyjayanthi Movie
Basha Shek
|

Updated on: May 12, 2025 | 10:59 AM

Share

నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. తల్లీ కొడుకుల సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. ప్రదీప్‌ చిలుకూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. కల్యాణ్ రామ్, విజయశాంతిల నటన బాగున్నా కథ, కథనాలు ఆడియెన్స్ ను నిరాశపర్చాయి. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అందరినీ కదలించింది. అలాగే కల్యాణ్ రామ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయని ప్రశంసలు వచ్చాయి. మొత్తానికి థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం (మే12) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీట స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రస్తుతం తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ, యూకేలో ఉన్నవాళ్లు అది కూడా అద్దె విధానంలో మాత్రమే ఈ మూవీని చూడొచ్చు. అయితే ఈ గురువారం లేదా శుక్రవారం ఇండియాలో కూడా ఈ మూవీ అందుబాటులోకి రావొచ్చునని తెలుస్తోంది.

ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాను నిర్మించారు. అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్, పృథ్వీ రాజ్, చరణ్ రాజ్, భరత్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అర్జున్ సన్నాఫ్ వైజయంతీ మూవీ స్ట్రీమింగ్..

అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమాలో కల్యాణ్ రామ్, విజయశాంతి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది..
రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది..
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో