OTT Movie: కాల్ గర్ల్సే ఈ సైకో కిల్లర్ టార్గెట్.. ఓటీటీలో దడ పుట్టించే తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ
ఈ మధ్యన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. మూవీ లవర్స్ వీటిని చూసేందుకు బాగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ మూవీ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఒక సైకో కిల్లర్ చుట్టూ తిరిగే ఈ మూవీ ఉత్కంఠంగా సాగిపోతుంది.

కొన్ని సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోవు. అందుకు చాలా కారణాలుంటాయి. పెద్దగా ప్రమోషన్లు లేకపోవడం, పేరున్న నటీనటులు ఉండకపోవడం.. ఇలా తదితర రీజన్స్ తో కొన్ని సినిమాలు బాగున్నా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేవు. కానీ ఇదే మూవీస్ ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం రికార్డు వ్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే జాబితాలోకి వస్తోంది. ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో అంతగా ఆడకపోయినా, ఓటీటీలో మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ఇందులో దివ్య అనే అమ్మాయి తన భర్త తో సంతోషకరమైన జీవితం గడుపుతూఉంటుంది. అయితే ఆమె జీవితంలో అనుకోకుండా ఒక విషాదం చోటు చేసుకుంటుంది. ఒక రోజు పోలీసులు తప్పుగా జరిపిన ఎన్‌కౌంటర్‌లో దివ్య భర్త ప్రాణాలు కోల్పోతాడు. దీంతో దివ్య జీవితం తలకిందులైపోతుంది. భర్త చేసిన అప్పుల కారణంగా దివ్య ఇబ్బందుల్లో పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే దివ్య నాలుగేళ్ల కూతురు దియాను, అప్పు ఇచ్చిన ఒక వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు. డబ్బులు ఇస్తేనే కూతుర్ని ప్రాణాలతో విడిచిపెడతానని వార్నింగ్ ఇస్తాడు. దీంతో డబ్బుల కోసం వేరే గత్యంతరం లేక వేశ్యగా మారుతుంది. ఈ క్రమంలో ఆమెను ఒక వ్యక్తి బుక్ చేసుకుంటాడు. అయితే అతను ఒక సీరియల్ కిల్లర్. ఈ విషయం తెలియక దివ్య అతని చేతిలో చిక్కుకుంటుంది దివ్య. ఈ హంతకుడు మహిళలను, అందులోనూ వేశ్యలను ఎక్కువగా ఎంచుకుంటుంటాడు. మరి ఆ సైకో బారి నుంచి దివ్య బయట పడిందా? తన కూతురును కాపాడుకుందా? లేదా? తెలుసుకోవాలంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడాల్సిందే.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘వైట్ రోజ్’ . 2024 లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి కె. రాజశేఖర్ దర్శకత్వం వహించారు. తమిళ్ తో పాటు తెలుగు భాషలోనూ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తెలుగు హీరోయిన్ ఆనంది, ఆర్‌కె సురేష్, రూసో శ్రీధరన్, విజిత్, బేబీ నక్షత్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు . ఈ మూవీని పూంబరై మురుగన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్ రంజని నిర్మించారు. థియేటర్లలో సోసోగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి వైట్ రోజ్ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








