AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jacqueline Fernandez: ఠక్కున చూసి ప్రభుదేవా అనుకునేరు! జాక్వెలిన్‌తో ఉన్నఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా?

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన ఓ సాంగ్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. విశేషమేమిటంటే.. ఈ వీడియో ఆల్బమ్ తో జాక్వెలిన్ తో పాటు మరొకరు కూడా స్టెప్పులేశాడు. పైన ఉన్న స్టిల్ ఆ ట్రెండింగ్ సాంగ్ లోనిదే.

Jacqueline Fernandez: ఠక్కున చూసి ప్రభుదేవా అనుకునేరు! జాక్వెలిన్‌తో ఉన్నఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా?
Jacqueline Fernandez
Basha Shek
|

Updated on: May 11, 2025 | 3:49 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. శ్రీలంకకు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి సాహో సినిమాలో స్టెప్పులేసిందీ అందాల తార. ప్రస్తుతం సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఈ బ్యూటీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేష్ చంద్ర‌శేఖ‌ర్ కారణంగా తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది జాక్వెలిన్. ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్, వీడియో ఆల్బమ్స్ లోనూ నటిస్తోందీ క్రేజీ హీరోయిన్. ఇందులో భాగంగా ఆమె నటించిన ‘బెసోస్..’ సాంగ్ ఇటీవలే రిలీజైంది. ఈ సాంగ్ లో జాక్వెలిన్ తో పాటు మరో సెలబ్రిటీ కూడా స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన కొన్ని స్టిల్స్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన వారందరూ జాక్వెలిన్ తో ఉన్నది ఎవరబ్బా? అని తలలు పట్టుకున్నారు. ఠక్కున చూసి చాలా మంది ఇండియన్ మైఖెల్ జాక్షన్ ప్రభుదేవా అనుకున్నారు. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని నాలుక కర్చుకున్నారు. ఎందుకంటే ఈ సాంగ్ లో జాక్వెలిన్ తో స్టెప్పలేసింది టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్.

ఈ సాంగ్ లో అందమైన జాక్వెలిన్ పక్కన శిఖర్ ధావన్ హీ మ్యాన్ లా కనిపిస్తున్నాడంటూ అభిమానులు ,నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే హ్యాట్ ధ‌రించి అచ్చం కౌబోయ్ ని త‌ల‌పిస్తున్నాడ‌ని ప్ర‌శంసిస్తున్నారు. ఇక ఈ సాంగ్ లో జాక్వెలిన్ తో శిఖ‌ర్ ధావన్ కెమిస్ట్రీ కూడా ఒక రేంజులో వ‌ర్క‌వుట్ అయ్యిందంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి ప్ర‌స్తుతం బెసోస్ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

కాగా భార్య‌కు విడాకులిచ్చిన శిఖ‌ర్ ధావన్ ఇటీవ‌ల ఓ విదేశీ అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడంటూ ప్ర‌చారం సాగుతోంది. ఈ జంట‌కు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఆ మధ్యన ధావన్ సినిమాల్లో కూడా నటిస్తాడంటూ ప్రచారం జరిగింది. ఈ రూమర్ ను ఇప్పుడు నిజం చేసేలా ఉన్నాడు ధావన్. అభిమానులు కూడా ఈ టీమిండియా క్రికెటర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం బెసోస్ సాంగ్ యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతోంది. మరి మీరు కూడా ఈ సాంగ్ ను చూసేయండి. జాక్వెలిన్, శిఖర్ ధావన్ ల ఎనర్జిటిక్ స్టెప్పులను ఎంజాయ్ చేయండి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్