AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇదేం సినిమా రా సామి.. ఇట్టా ఉంది.. ఒంటరిగా చూసే ధైర్యం చేయకండి..

హార్రర్ సినిమాలు చూడాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో హార్రర్ సినీప్రియులు సైతం భయపడే భయానక చిత్రాలు కూడా ఉన్నాయి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, గ్రిప్పింగ్ గా ఉన్న సినిమా గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రాన్ని మీరు ఒంటరిగా చూసే ధైర్యం మాత్రం చేయకండి.

OTT Movie: ఇదేం సినిమా రా సామి.. ఇట్టా ఉంది.. ఒంటరిగా చూసే ధైర్యం చేయకండి..
Talk To Me
Rajitha Chanti
|

Updated on: May 11, 2025 | 1:26 PM

Share

ఓటీటీల్లో ప్రతి వారం సరికొత్త కంటెంట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. కొందరు రొమాంటిక్ ప్రేమకథలను ఇష్టపడితే.. మరికొందరు యాక్షన్, థ్రిల్ చిత్రాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇంకొదరు మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ చిత్రాలపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా మిమ్మల్నీ ఆద్యంతం కట్టిపడేస్తుంది. ప్రతిక్షణం భయానకం.. ఊహించని ట్విస్టులతో గుండె ఆగినంత పని చేస్తుంది. అదే టాక్ టు మీ. 2022లో విడుదలైన ఆస్ట్రేలియన్ హారర్ చిత్రం ఇది. ఈ చిత్రానికి డానీ ఫిలిప్పో, మైఖేల్ ఫిలిప్పో అనే ఇద్దరు సోదరులు దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ A24 బ్యానర్ పై దీనిని నిర్మించారు.

ఈ చిత్రంలో సోఫీ వైల్డ్, జో అలెక్స్, మిరాండా ఒట్టో, ఓటిస్ ధెనింగ్, అలెగ్జాండర్ జెన్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక వింత ఆటలో చిక్కుకున్న యువకుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఆ ఆటలో ఆత్మలను ఒక వింత చేతి బొమ్మ ఉపయోగించి సంప్రదిస్తారు. అయితే మొదట్లో సరదాగా సాగినా.. ఆ తర్వాత విగ్రహం నుంచి ఒక దుష్ట ఆత్మ వారిలో ప్రవేశిస్తుంది. దీంతో అసలు కథ మొదలవుతుంది. ఆ యువకుల జీవితాల్లో భయానక పరిస్థితులు ఎదురవుతాయి. అందులో ఒక్కొక్కరిగా మరణిస్తుంటారు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం, సంగీతం, వాతావరణం ప్రేక్షకులను మరింత భయపెట్టిస్తుంటాయి.

ప్రారంభం నుంచి చివరి వరకు ఈ మూవీ ప్రతిక్షణం ఊహించని మలుపులతో కట్టిపడేస్తుంది. రూ.37 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ213 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ హిందీలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..