AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోవిందుడు అందరివాడేలేలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

రామ్ చరణ్ చివరిగా గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. కానీ ఈ సినిమా ఓటీటీలో ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు చేస్తోన్న రెండో సినిమా కావడంతో మరింత హైప్ నెలకొంది.

గోవిందుడు అందరివాడేలేలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Govindudu Andarivadele
Rajeev Rayala
|

Updated on: May 19, 2025 | 9:56 AM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఒకొక్క సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ నటుడిగా ఒకొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాడు మెగా పవర్ స్టార్. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ను లైనప్ చేశాడు. ఊరమాస్ కంటెంట్ తో తెరకెక్కుతున్న పెద్ది సినిమా త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చరణ్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన సినిమాల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గోవిందుడు అందరివాడేలే సినిమా ఒకటి.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో చరణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటించింది. ఇక ఈ సినిమాలో చరణ్ చెల్లెలి పాత్రలో నటించిన అమ్మడు గుర్తుందా.? ఆమె ఎవరు.? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆ బ్యూటీ పేరు అయేషా కాదుస్కర్. గోవిందుడు అందరివాడేలే సినిమాలో కనిపించింది కొంతసేపు అయినా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నది.

అయితే చూడటానికి అచ్చం తెలుగమ్మాయిలానే ఉండే ఈ అమ్మడు ముంబై కి చెందని నటి. 2012లో వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన అగ్నిపథ్ సినిమాలో నటించింది అయేషా.. ఆతర్వాత 2014లో టాలీవుడ్ లో గోవిందుడు అందరివాడేలే సినిమాలో కనిపించింది. ఈ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో చేయలేదు ఈ చిన్నది. కానీ బాలీవుడ్ లో మాత్రం సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఆయుష్మాన్ ఖురానా నటించిన డాక్టర్ జీ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది యమా యాక్టివ్ గా ఉంటుంది. రోజు రకరకాల ఫోటోలను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటోంది అయేషా. ఈ క్రమంలోనే ఈచిన్నదాని కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Ayesha Kaduskar (@ayeshak_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.