AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పుడు ఇండస్ట్రీనే ఊపేస్తున్న అందాల భామ..! హీరోయినే కాదు సింగర్ కూడా

సోషల్ మీడియాలో చైల్డ్ ఫోటోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో నిత్యం పంచుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే కొంతమంది హీరోయిన్స్ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇప్పుడు ఇండస్ట్రీనే ఊపేస్తున్న అందాల భామ..! హీరోయినే కాదు సింగర్ కూడా
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 16, 2025 | 10:53 AM

Share

సినిమా సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. హీరోయిన్స్ కు సంబందించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్స్ ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తూ ఉంటారు. తమిళ చిత్రసీమలో చాలా మంది టాలెంటెడ్ నటులు ఉన్నారు. పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలు. తన నటనతోనే కాదు అందంతోనూ కవ్విస్తుంది ఈ వయ్యారి భామ. ఈ అందాల భామకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. హాట్ బ్యూటీ ఆండ్రియా జెరెమియా. తన అందంతో ప్రేక్షకులను కాట్టిపడేస్తోంది ఈ చిన్నది. ఆమె నటి మాత్రమే కాదు సింగర్ గాను అలాగే డబ్బింగ్ కళాకారిణిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. కాలేజ్ లో ఉన్నప్పుడు.. ఆండ్రియా జెరెమియా అనేక రంగస్థల నాటకాలలో నటించింది. విక్రమ్ నటించిన అపరిచితుడు చిత్రంలో ‘నాకు నీకు నోకియా’ పాట పాడటం ద్వారా ఈ ముద్దుగుమ్మ సింగర్ గా తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఆండ్రియా ఆంగ్లో-ఇండియన్ రోమన్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది. ఆండ్రియా తమిళం, తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలలో తన నటనతో ఆకట్టుకుంది.

గౌతమ్ మీనన్ ప్రధవరు పార్ధతులో సాంగ్ పాడిన తరువాత, దర్శకుడు గౌతమ్ మీనన్ ఆండ్రియాకు తన తదుపరి చిత్రం పచ్చైక్కిలి ముత్తుచారంలో నటించే అవకాశాన్ని ఇచ్చాడు. ఆతర్వాత వరుసగా గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిష్కిన్, వేతిమారన్, రామ్, సెల్వరాఘవన్ వంటి దర్శకుల ఎంపిక ఆండ్రియా. కమల్, అజిత్, విజయ్ లాంటి స్టార్స్ తో నటించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us