బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయిన శోభిత.. బ్యూటిఫుల్ ఫొటోస్
శోభిత ధూళిపాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగచైతన్యతో వివాహం జరిగిన తర్వాత ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ అయ్యింది. ఎప్పుడూ తన బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేస్తూ, అభిమానుల మనసు దోచేస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో తన అందాలతో అందరినీ మాయ చేసింది.
Updated on: Nov 17, 2025 | 10:30 AM

అందాల ముద్దుగుమ్మ శోభితా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అక్కినేని నాగార్జున పెద్దకుమారుడు నాగచైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక చైతూతో వివాహం తర్వాత ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది.

పెళ్లి తర్వాత ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ రామన్ రాఘవన్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కానీ ఈ మూవీ ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు తీసుకరాలేదనే చెప్పాలి.

మూవీ తర్వాత ఈ అమ్మడు తెలుగులో చేసినవి చాలా తక్కువే. కానీ, ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాల్లో ఎక్కవగా నటించి, తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇక చైతూ విడాకుల తర్వాత ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో నిలిచింది.

నాగచైతన్యతో ప్రేమలో ఉన్నదంటూ అనేక వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు అవే నిజం చేస్తూ.. నాగచైతన్య, శోభితా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇక ఈ బ్యూటీ పెళ్లి తర్వాత తన లుక్ మొత్తం మార్చేసింది. ఎప్పుడూ ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది.

కానీ చాలా రోజుల తర్వాత ఈ ముద్దుగుమ్మ మోడ్రన్ డ్రెస్ లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో మోడ్రన్ డ్రెస్ లో ఈ చిన్నది అదిరిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.



