AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Annamayya Movie: అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రను మిస్ చేసుకున్న హీరోలు ఎవరో తెలుసా ?.. చివరకు సుమన్..

ఇందులో అన్నమయ్య పాత్రలో నాగార్జున జీవించేశారు. అలాగే.. వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ ఆ శ్రీవారినే మైమరపించారు. ఇప్పటికీ ఈ సినిమా సినీ ప్రియులకు ఎవర్ గ్రీన్. వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Annamayya Movie: అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రను మిస్ చేసుకున్న హీరోలు ఎవరో తెలుసా ?.. చివరకు సుమన్..
Suman
Rajitha Chanti
|

Updated on: Mar 28, 2023 | 8:38 AM

Share

అక్కినేని నాగార్జున కెరీర్‏లో సూపర్ హిట్ అయిన చిత్రాలలో అన్నమయ్య ఒకటి. 1997లో డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ, కస్తూరి ప్రధాన పాత్రలో పోషించగా.. మోహన్ బాబు, రోజా, సుమన్, భానుప్రియ, శ్రీకన్య, బ్రహ్మానందం, కోట శ్రీనివాస్ రావు కీలకపాత్రలలో కనిపించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో అన్నమయ్య పాత్రలో నాగార్జున జీవించేశారు. అలాగే.. వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ ఆ శ్రీవారినే మైమరపించారు. ఇప్పటికీ ఈ సినిమా సినీ ప్రియులకు ఎవర్ గ్రీన్. వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

అయితే శ్రీవారి పాత్ర కోసం ముందుకు ఎంపిక చేసింది సుమన్ ను కాదట. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి భక్తునిగా అప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో వెంకటేశ్వర స్వామి పాదాలపై పడే సన్నివేశాలు ఉన్నాయి. అందుకే స్వామి వారి పాత్రకు ఓ సీనియర్ హీరో అయితే బాగుంటుందని రాఘవేంద్రరావు భావించారట. దీంతో ఈ పాత్ర కోసం ముందుగా శోభన్ బాబును సంప్రదించారట. కానీ ఆయన ఈ పాత్ర చేసేందుకు నిరాకరించడంతో ఆ ఛాన్స్ బాలకృష్ణను చేరిందట.

ఇవి కూడా చదవండి

కానీ ఇద్దరు స్టార్ హీరోస్ ఇలాంటి పాత్రలలో నటిస్తే ఫ్యాన్స్ ఎలా స్వీకరిస్తారో అనే భయంతో రాఘవేంద్రరావు వెనక్కి తగ్గారట. ఇక చివరకు వెంకటేశ్వర స్వామి పాత్రకు సుమన్ బాగుంటుందని భావించిన రాఘవేంద్రరావు… ఆయనను కలిసి కథ వినిపించడంతో సుమన్ వెంటనే ఓకే చేశారట. అలా ఈ అద్భుతమైన అవకాశం సుమన్ సొంతం చేసుకున్నారు. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా.. సంగీతం పరంగా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.