నయనతార వదులుకుంది.. ఆ హీరోయిన్ ఆఫర్ అందుకుంది.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా
లేడీ సూపర్ స్టార్ నయనతార.. దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. వైవిధ్యమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో సౌత్ లో దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో కనిపించింది.

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్. అత్యధిక పారితోషికం తీసుకునే సినీతారలలో ఆమె ఒకరు. నయనతార.. సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన అమ్మడు. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తుంది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ సీనియర్ బ్యూటీ, ఆ సినిమాతో సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత నయనతారకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటుంది నయన్. బడా హీరోల సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది నయన్.
ఇది కూడా చదవండి : సినిమా మొత్తం రచ్చ.. బోల్డ్ సీన్స్ అరాచకంతో థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే.!
ఇదిలా ఉంటే నయనతార ఓ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిందట.. ఆమె నో చెప్పడంతో ఆ అవకాశం మరో స్టార్ హీరోయిన్ అందుకొని భారీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇంతకూ ఆమె ఎవరో.? ఆ హీరో ఎవరో.? ఆ సినిమా ఎదో తెలుసా.? నయన్ ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే నయన్ మిస్ చేసుకున్న సినిమా ఏదంటే.. బాలీవుడ్ లో తెరకెక్కిన చెన్నై ఎక్స్ ప్రెస్. రోహిత్ శెట్టి దర్శకతంలో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా భారీ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ముందుగా ఈ సినిమాలో నయనతారను హీరోయిన్ గా అనుకున్నారట.
ఇది కూడా చదవండి : Jabardasth: నాకోసం పెళ్లి పీటలమీదనుంచి వచ్చేసేది.. లవ్ స్టోరీ బయట పెట్టిన జబర్దస్త్ నరేష్..
చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో హీరోయిన్ తమిళ్ మాట్లాడే యువతిగా కనిపిస్తుంది. దాంతో ఈ సినిమాలో నయనతార అయితే బాగుంటుందని దర్శకుడు భావించాడట. కానీ అదే సమయంలో ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆలోచించారట.. అదే సమయంలో ఆమె జీవితంలో కీలక మార్పులు జరుగుతుండటంతో చెన్నై ఎక్స్ ప్రెస్ ఆఫర్ కు నో చెప్పిందట. ఇక ఈ సినిమాలో నయన్ ప్లేస్ లో దీపికా పదుకొణే అద్భుతంగా నటించి మెప్పించింది. ఇక షారుక్ ఖాన్ హీరోగా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా సంచలన విజయం సాధించింది. షారుక్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే దీపికా కెరీర్ కు మంచి మైలేజ్ ఇచ్చింది ఈ సినిమా.
ఇది కూడా చదవండి : బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు గురూ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








