Tollywood : కృతి శెట్టి, శ్రీలీలకాదు..టాలీవుడ్‌లో అందరికంటే చిన్న హీరోయిన్ ఈ బ్యూటీనే

ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్ చిన్న ఏజ్ లోనే సినిమాల్లోకి వస్తున్నారు. చిన్న వయసులోనే హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. అయితే టాలీవుడ్ అందరికంటే చిన్న వయసున్న హీరోయిన్ ఎవరో తెలుసా.? కృతిశెట్టి , శ్రీలీల కాదు. ఈ ఇద్దరి కంటే చిన్న హీరోయిన్ టాలీవుడ్ లో ఉంది.

Tollywood : కృతి శెట్టి, శ్రీలీలకాదు..టాలీవుడ్‌లో అందరికంటే చిన్న హీరోయిన్ ఈ బ్యూటీనే
Tollywood
Follow us

|

Updated on: Sep 04, 2024 | 12:00 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొంతమంది తమ అందం అభినయంతో ఆకట్టుకుంటుంటే మరికొంతమంది కేవలం గ్లామర్ తోనే ప్రేక్షకులను కవ్విస్తున్నారు. ఇంకొంతమంది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కొందరు. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్ చిన్న ఏజ్ లోనే సినిమాల్లోకి వస్తున్నారు. చిన్న వయసులోనే హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. అయితే టాలీవుడ్ అందరికంటే చిన్న వయసున్న హీరోయిన్ ఎవరో తెలుసా.? కృతిశెట్టి , శ్రీలీల కాదు. ఈ ఇద్దరి కంటే చిన్న హీరోయిన్ టాలీవుడ్ లో ఉంది. ఆమె తన అందంతో పాటు నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.

టాలీవుడ్ చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటివారిలో ఆ బ్యూటీ ఒకరు. ఆమె అందరికంటే చిన్న ఏజ్ ఉన్న హీరోయిన్ ఆమె. టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ అంటే ముందు గుర్తొచ్చేది కృతిశెట్టినే .. చిన్న వయసులోనే ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చింది. ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా మారిన ఈ అమ్మడు వయసు ఇప్పుడు 20 ఏళ్లు. అలాగే కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కుర్రాడి శ్రీలీల ఏజ్ కూడా తక్కువే.. పెళ్ళిసందడి సినిమాతో పరిచయమైనా ఈ బ్యూటీ వయసు 23. ఈ ఇద్దరి కంటే ఓ హీరోయిన్ చిన్నది.

ఆమె ఎవరంటే రీసెంట్ డేస్ లో ప్రేక్షకులను మెప్పించిన సినిమాల్లో మ్యాడ్ సినిమా ఒకటి. సంతోష్ శోభన్, నార్ని నితిన్, రామ్‌ నితిన్‌, ప్రధానపాత్రల్లో నటించిన మ్యాడ్ సినిమాలో నటించింది అననతిక. మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం. చిన్నది ఈ సినిమాలో తన నటనతో అందంతో ఆకట్టుకుంది. అలాగే రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ అనే సినిమాలోనూ నటించింది. ఈ చిన్నదాని ఏజ్ కేవలం 18ఏళ్లు మాత్రమే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి