Tollywood: హీరో మెటిరియల్ రా బాబూ.. తండ్రి తోపు కమెడియన్.. కానీ కొడుకు IAS ఆఫీసర్.. ఎవరంటే
సాధారణంగా సినీపరిశ్రమలో స్టార్స్ వారసులు తమ తల్లిదండ్రుల మాదిరిగానే నటీనటులుగా తెరంగేట్రం చేస్తుంటారు. కొందరు తక్కువ సమయంలోనే గుర్తింపు సంపాదించుకుంటారు. మరికొందరు విఫలమవుతారు. కానీ సినిమా పరిశ్రమలోకి కాకుండా మరో రంగాన్ని ఎంచుకున్న తారల వారసులు చాలా మంది ఉన్నారు. అందులో ఈ కుర్రాడు ఒకరు.

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు తమ కంటే ప్రసిద్ధులు కావాలని కోరుకుంటారు. ఇక సినిమా ప్రపంచంలో తల్లిదండ్రుల బాటలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన స్టార్స్ చాలా మంది ఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో నటవారసత్వం అందిపుచ్చుకుని ప్రేక్షకులకు దగ్గరైన తారలు ఉన్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అబ్బాయి తండ్రి ఇండస్ట్రీలోనే తోపు కమెడియన్. కానీ తండ్రి బాటలో ఇండస్ట్రీలోకి కాకుండా మరో రంగంలోకి అడుగుపెట్టారు. తన తండ్రి సినీరంగంలో తోపు కమెడియన్. సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో కలిసి పనిచేశారు. కానీ ఆయన తనయుడు మాత్రం IAS అధికారి అయ్యాడు. అతను ఎవరో మీకు తెలుసా? ఆయనే శ్రుతంజయ్ నారాయణన్. సీనియర్ తమిళ నటుడు, హాస్యనటుడు చిన్ని జయంత్ కుమారుడు.
చిన్ని జయంత్ తమిళ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. చిన్ని జయంత్ రజనీకాంత్ తో కలిసి ‘రాజా చిన్న రోజా’, ‘అధిసయ్ పిరవి’ నుండి ‘పెట్టా’ వంటి చిత్రాల్లో పనిచేశారు. అలాగే తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తన కామెడీతో ప్రేక్షకులను అలరించారు. అయితే తండ్రి నటుడు అయినప్పటికీ ఆయన కుమారుడు శ్రుతంజయ్ నారాయణ్ తన కలను నెరవేర్చుకున్నాడు. అతడికి మొదటి నుండి సినిమాలంటే ఆసక్తి లేదు.. కానీ నిత్యం చదువుపై దృష్టిపెట్టేవాడు. ఒక స్టార్టప్ కంపెనీలో నైట్ వర్క్ చేస్తూ తన కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించారు.
అలాగో రోజుకు 10 నుంచి 12 గంటలు చదువుతూ యూపీఎస్సీకి ప్రీపేర్ అయ్యేవారు. చివరకు రెండవ ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షణలో ఉత్తీర్ణుడయ్యాడు. అతడు తిరుప్పూర్ జిల్లా సబ్ కలెక్టర్ గా పనిచేశాడు. ఇప్పుడు విల్లుపురం జిల్లా సబ్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు.

Srutanjay Narayanan
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..




