AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘నేను ఆల్కహాల్ తీసుకుంటా.. మా అమ్మానాన్నలకు కూడా తెలుసు’.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఆల్కహాల్ తీసుకోవడం సర్వ సాధారణం. అందులో తప్పేమీ లేదు. ముఖ్యంగా సినిమా హీరోలు, హీరోయిన్లు పార్టీలు, ఫంక్షన్లలో మద్యం తీసుకుంటుంటారు. అయితే ఎవ‌రూ బ‌య‌ట‌కు చెప్పుకోవ‌డానికి పెద్దగా ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఈ టాలీవుడ్ నటి మాత్రం ఆల్కహాల్ తీసుకుంటానంటూ బహిరంగంగా చెప్పుకొచ్చింది.

Tollywood: 'నేను ఆల్కహాల్ తీసుకుంటా.. మా అమ్మానాన్నలకు కూడా తెలుసు'.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jun 04, 2025 | 10:38 AM

Share

గతంలో పలు తెలుగు సినిమాల్లో సహాయ నటిగా మెప్పించిందీ అందాల తార. రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, విక్టరీ వెంకటేష్ , రవితేజ, సమంత, శర్వానంద్ వంటి స్టార్ హీరోల, హీరోయిన్ల సినిమాల్లో వివిధ పాత్రలు పోషించింది. హీరోలు, హీరోయిన్లకు సిస్టర్ గా, ఫ్రెండ్ గా, అక్కగా, వదినగా అలరించింది. తన క్యూట్ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. తమిళంలోనూ కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది. అయితే గత కొన్ని రోజులుగా సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్ల నిలుస్తోందీ అందాల తార. ఆ మధ్యన టాలీవుడ్ కు చెందిన ఓ ఫేమస్ కమెడియన్ పై ఈ బ్యూటీ చేసిన ఆరోపణలు చేసి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా మరో వివాదంలో చిక్కుకుందీ ముద్దుగుమ్మ. తన బర్త్‌ డే సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. అదే సమయంలో పబ్‌ సిబ్బందితో గొడవ జరిగింది. బర్త్ డే కేక్ విషయమై పబ్ నిర్వాహకులకు, ఆమెకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరలయ్యాయి. అయితే పబ్లిసిటీ కోసమే నటి ఇదంతా చేసిందని ప్రచారం జరుగుతోంది. ఇలా గత నాలుగు రోజులుగా వార్తల్లో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోన్న ఆ బ్యూటీ మరెవరో కాదు కల్పికా గణేష్.

తాజాగా ఈ వివాదంపై స్పందించిన కల్పిక సంచలన కామెంట్స్ చేసింది. పబ్ నిర్వాహకులతో గొడవ పబ్లిసిటీ స్టంట్ కాదని క్లారిటీ ఇచ్చింది. ‘బర్త్ డే పార్టీలో నేను మందు తాగలేదు. నాకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది. ఈ విషయం మా అమ్మానాన్నలు, స్నేహితులకు కూడా తెలుసు. గతంలో పలు సార్లు సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలో వైన్ తీసుకున్నాను. అయితే ప్రస్తుతం ఈ అలవాటుకు దూరంగా ఉన్నాను. పబ్ లో కేవలం వార్మ్ వాటర్ మాత్రమే తీసుకున్నాను’ అని కల్పిక గణేష్ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

కల్పిక గణేష్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by iamkalpika (@iamkalpika27)

బిగ్ బాస్ కోసమే ఇది చేశారా?

బిగ్‌బాస్ సీజన్ 9 ఛాన్స్ కోసమే మీరు ఇలా చేశారా? అని కల్పికను అడగ్గా.. ‘ అలాంటి దేమీ లేదు. బహుశా వాళ్లే నన్ను హౌస్ లో చూడాలనుకుంటున్నారేమో?’ అని ఆన్సర్ ఇచ్చింది.

View this post on Instagram

A post shared by Fapper (@fapper_fp)

ఇవి కూడా చదవండి

Tollywood: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. ఊరుకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ పేరు.. వీడియో చూస్తే వావ్ అంటారు

Tollywood: ఇన్ఫోసిస్‌లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు.. ఇస్రోలోనూ ఆఫర్.. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. గుర్తు పట్టారా?

Manchu Manoj-Ram Charan: మంచు మనోజ్ వద్దన్నాడు.. కట్ చేస్తే.. అదే కథతో రామ్ చరణ్ సూపర్ హిట్.. ఏ మూవీనో తెలుసా?

Tollywood: టాలీవుడ్ తోపు హీరోయిన్.. 12 ఏళ్లలో 100కు పైగా సినిమాలు.. కానీ 3నెలల గర్భంతో 32 ఏళ్లకే కన్నుమూసింది