AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సినిమాల్లో హీరో.. నిజ జీవితంలో పోలీస్ ఇన్స్పెక్టర్.. బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే..

నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన తారలు చాలా మంది అటు వివిధ రంగాల్లోనూ రాణిస్తున్నారు. కానీ మీకు తెలుసా.. ? పోలీస్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీగా పదోన్నతి పొందిన ఓ వ్యక్తి సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అతడు ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం ఈ నటుడికి మంచి ఫాలోయింగ్ ఉంది.

Tollywood: సినిమాల్లో హీరో.. నిజ జీవితంలో పోలీస్ ఇన్స్పెక్టర్.. బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే..
Anand Kumar
Rajitha Chanti
|

Updated on: Aug 28, 2025 | 5:17 PM

Share

సినిమా అంటే చాలా ఇష్టమున్న చాలా మందికి సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. నటనపై ఆసక్తి ఉన్న చాలా మంది ఆ కలను కొనసాగించలేక ఇతర ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ నటుడు నిజ జీవితంలో మాత్రం పోలీస్ ఇన్పెక్టర్. అతడి పేరు ఆనంద్ కుమార్ ఓజా. వయసు 45 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన అతడు ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. మరోవైపు భోజ్ పురి సినిమా ప్రపంచంలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో సినిమాల్లో నటించాలని అనుకున్నాడు. పాఠశాల రోజుల్లోనే ఎవరికీ తెలియకుండా ముంబై వెళ్లాలని ప్రయత్నించారు. కానీ అది వీలు కాలేదు. ఆ తర్వాత మరోసారి కాలేజీలో ఉన్నప్పుడు సినీరంగంలోకి వెళ్లాలి అనుకున్నారు.

ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్.. 

మనస్థాపం చెందిన ఓజా ఇంటికి తిరిగి వచ్చి చదువుపై దృష్టి పెట్టారు. చివరకు పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఓజా మాట్లాడుతూ.. “సినిమాలపై నాకున్న మక్కువ కారణంగా.. స్కూల్లో ఉండగానే కేవలం 20 రూపాయలతో ఇంటి నుండి ముంబైకి వెళ్లాను. నా దగ్గర టికెట్ లేకపోవడంతో ఒక రైల్వే ఉద్యోగి నన్ను వెనక్కి పంపించాడు. నా పట్టుదల చూసి, నా స్నేహితులు 500 రూపాయలు వసూలు చేసి ముంబైకి పంపారు. అక్కడ, నేను వాచ్‌మెన్‌గా పనిచేశాను. ప్రతి స్టూడియోలో అవకాశాల కోసం వెతుకుతూ తిరిగాను. నాకు ఎటువంటి అవకాశం రాలేదు. అలసిపోయిన నాన్న నన్ను తిరిగి మా ఊరికి తీసుకువచ్చాడు. నన్ను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనుకున్నాడు. ఆ సమయంలో, వారణాసిలో పోలీసు ఉద్యోగాలకు పరీక్ష ఉందని నా స్నేహితులు నాకు చెప్పారు. నాన్న కోరిక కోసం పరీక్ష రాసి పాసయ్యాను. మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ దగ్గర సెక్యూరిటీ గార్డుగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి ముంబై వెళ్లాల్సి వచ్చింది. అక్కడ భోజ్ పురి నిర్మాత నిర్మల్ పాండేని కలిశాను. సినిమాలో నటించి అవకాశం వచ్చింది ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..

హీరోగా ఓజా మొదటి సినిమా 2013లో విడుదలైంది. అప్పటి నుంచి సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. ఇటీవల ఆగ్రాకు బదిలీ అయిన ఓజా ఇప్పుడు షూటింగ్ లేని రోజుల్లో ఆగ్రా ప్రధాన రహదారులపై గస్తీ తిరుగుతున్న పోలీసుగా కనిపించారు. సినిమా కోసం ఇప్పటివరకు ఒక్క సెలవు కూడా తీసుకోలేదని అతడి తోటి పోలీసులు చెబుతున్నారు. ఓజా తెరపై మాత్రమే హీరో కాదు. నిజ జీవితంలో కూడా హీరో. కొన్ని సంవత్సరాల క్రితం, లక్నోలో డ్యూటీలో ఉన్నప్పుడు కిడ్నాప్ చేయబడిన 22 ఏళ్ల కాలేజీ అమ్మాయిని రక్షించడం ద్వారా అతను వార్తల్లో నిలిచాడు.

ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..

Anand Kumar News

Anand Kumar News

ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..