AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తండ్రి క్రికెటర్.. 1200 కోట్లకు వారసుడు ఈ స్టార్ హీరో.. అయినా పిల్లలకు ఒక్క పైసా ఇవ్వలేడు..

తల్లిదండ్రులను గర్వపడేలా చేసిన బాలీవుడ్ తారలు ఎందరో ఉన్నారు. అందులో ఓ క్రికెటర్ తనయుడు కూడా ఉన్నారు. తండ్రి క్రికెటర్, తల్లి నటి. దీంతో చిన్నప్పుడే సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. 1993 సంవత్సరంలో నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించి రొమాంటిక్ హీరోగా నటించి మెప్పించాడు. కానీ ఇప్పుడు విలన్‌ పాత్రలను పోషిస్తూ కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అతడు మరెవరో కాదు

Tollywood: తండ్రి క్రికెటర్.. 1200 కోట్లకు వారసుడు ఈ స్టార్ హీరో.. అయినా పిల్లలకు ఒక్క పైసా ఇవ్వలేడు..
Actor
Rajitha Chanti
|

Updated on: Aug 16, 2024 | 1:41 PM

Share

తల్లిదండ్రులను గర్వపడేలా చేసిన బాలీవుడ్ తారలు ఎందరో ఉన్నారు. అందులో ఓ క్రికెటర్ తనయుడు కూడా ఉన్నారు. తండ్రి క్రికెటర్, తల్లి నటి. దీంతో చిన్నప్పుడే సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. 1993 సంవత్సరంలో నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించి రొమాంటిక్ హీరోగా నటించి మెప్పించాడు. కానీ ఇప్పుడు విలన్‌ పాత్రలను పోషిస్తూ కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అతడు మరెవరో కాదు బీటౌన్ హీరో సైఫ్ అలీఖాన్. 1970 ఆగస్టు 16న జన్మించిన సైఫ్ ‘ఆషిక్ ఆవారా’ సినిమాతో హీరగా మారాడు. తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా అతను భారతదేశంలోని ధనిక ప్రముఖులలో ఒకరు. సైఫ్ ఆస్తుల విలువ 1200 కోట్లకు పైగానే ఉంది. ఇందులో ఆయనకు రూ.5000 కోట్ల విలువైన పూర్వీకుల ఆస్తి ఉంది. అయితే ఈ హీరో తన ఆస్తి నుంచి తన పిల్లలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేడు.

సైఫ్ 54 సంవత్సరాల క్రితం మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ దంపతులకు జన్మించాడు. మన్సూర్ అలీఖాన్ నవాబీ కుటుంబానికి చెందినవాడు. అందువల్ల సైఫ్ పటౌడీకి పదవ నవాబు అయ్యాడు. మీడియా నివేదికల ప్రకారం, సైఫ్ అలీ ఖాన్‌కు దాదాపు రూ. 5 వేల కోట్ల విలువైన పూర్వీకుల ఆస్తి ఉంది. ఇందులో హర్యానాలోని పటౌడీ ప్యాలెస్‌తో పాటు, భోపాల్‌లో కూడా చాలా ఆస్తి ఉంది. అయితే సైఫ్ తన సొంత పిల్లలు, కూతురు సారా అలీ ఖాన్, కొడుకులు ఇబ్రహీం అలీ, తైమూర్ అలీ, జెహ్ అలీకి తన ఆస్తిలో ఒక్క పైసా కూడా ఇవ్వలేడు.

నిజానికి, సైఫ్ విలాసవంతమైన ఇల్లు పటౌడీ ప్యాలెస్ 1968 ఎనిమీ డిస్ప్యూట్ యాక్ట్ కింద వస్తుంది. అలాంటి ఆస్తిపై అతని హక్కులను ఎవరూ క్లెయిమ్ చేయలేరు. ఈ చట్టం ప్రకారం, విభజన లేదా 1965, 1971 యుద్ధాల తర్వాత పాకిస్తాన్‌కు వలస వెళ్లి అక్కడి పౌరసత్వం తీసుకున్న వారి స్థిరాస్తులన్నీ శత్రు వివాద ఆస్తులుగా ప్రకటించబడ్డాయి. ఈ ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ఇప్పుడు ఎవరైనా హైకోర్టు, సుప్రీంకోర్టు లేదా భారత రాష్ట్రపతికి వెళ్లవచ్చు. అయితే ఇది ఉన్నప్పటికీ దానిపై ఏదైనా చర్య తీసుకోవడం చాలా కష్టం.

సైఫ్ అలీఖాన్ ముత్తాత హమీదుల్లా ఖాన్ బ్రిటీష్ పాలనలో నవాబుగా ఉన్నాడు. అతను తన మొత్తం ఆస్తిని వీలునామా చేయలేకపోయాడు. సైఫ్ ఈ ఆస్తులను తన పిల్లల పేరిట బదిలీ చేయడానికి ప్రయత్నిస్తే, పటౌడీ కుటుంబం, ముఖ్యంగా పాకిస్తాన్‌లోని సైఫ్ పెద్దమ్మ వారసులు ఈ విషయంలో వివాదాన్ని లేవనెత్తడానికి ఇదే కారణం. షర్మిలా ఠాగూర్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడారు. తన ఆస్తిని తన పిల్లలకు బదలాయించలేనని చెప్పింది. నిజానికి, ఇస్లాంలో వీలునామా చేయడం అనుమతించబడదు. మీరు మీ వారసులు కాని వారికి ఇవ్వవచ్చు, కానీ మీ వారసులకు కాదు. ఏదో 25 శాతం, 50 శాతం పని చేస్తుంది. ఈ విషయాన్ని షర్మిలా ఠాగూర్ వెల్లడించారు.

సైఫ్‌కి పూర్వీకుల ఆస్తులే కాకుండా సొంత ఆస్తి కూడా ఉంది. పటౌడీ ప్యాలెస్, ముంబై ఆస్తిని కలిపితే, సైఫ్ రూ.1,120 కోట్ల ఆస్తికి యజమాని.సైఫ్ ప్రతి నెలా రూ. 3 కోట్లు, సంవత్సరానికి రూ. 30 కోట్లకు పైగా సంపాదిస్తున్నాడు. సైఫ్ తన సినిమాలే కాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో సహా అనేక ఇతర వనరుల నుండి నెలకు కోట్ల రూపాయలను సంపాదిస్తాడు. అత్యధికంగా పన్ను చెల్లించే నటుల్లో ఆయన కూడా ఒకరు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.