Srikanth: శ్రీకాంత్‌కు భార్యగా, వదినగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇద్దరిదీ సూపర్ జోడి.. ఎవరంటే..
తెలుగు సినీపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరో. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న నటుడు శ్రీకాంత్. అందమైన ప్రేమకథలతోపాటు విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్నాడు. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ హీరో.. ఇప్పుడు సహయ నటుడిగానూ రాణిస్తున్నారు. అయితే మీకు తెలుసా.. శ్రీకాంత్ భార్యగా, వదినగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలలో శ్రీకాంత్ ఒకరు. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 125 చిత్రాల్లో నటించి మెప్పించారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన శ్రీకాంత్..ఆ తర్వాత విలన్ గా అలరించారు. వన్ బై టు సినిమాతో హీరోగా మారిన శ్రీకాంత్.. ఆ తర్వాత తాజ్ మహల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన నటనతో కట్టిపడేశారు. అప్పట్లో స్టార్ హీరోగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన శ్రీకాంత్.. ఇప్పుడు యంగ్ హీరోల సినిమాల్లో సహయ నటుడిగా అలరిస్తున్నారు. అయితే మీకు తెలుసా.. ? శ్రీకాంత్ కెరీర్ లో భార్యగా, వదినగా నటించిన ఏకైక హీరోయిన్ గురించి. ఆమె సైతం దక్షిణాదిలో టాప్ హీరోయిన్. అందం, అభినయంతో కట్టిపడేసింది. నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో జతకట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఇక శ్రీకాంత్ భార్యగా, వదినగా నటించిన హీరోయిన్ మరెవరో కాదండి.. స్నేహ. 90వ దశకంలో స్టార్ హీరోగా అలరించిన శ్రీకాంత్.. ఆ తర్వాత సహయ పాత్రలు పోషించారు. శ్రీకాంత్, స్నేహ జోడికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరు కలిసి నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఒక సినిమాలో శ్రీకాంత్ భార్యగా కనిపించిన స్నేహ.. మరో చిత్రంలో వదినగా కనిపించింది. 2005లో డైరెక్టర్ బాపు తెరకెక్కించిన రాధా గోపాలం సినిమాలో శ్రీకాంత్, స్నేహ భార్యభర్తలుగా కనిపించారు.
ఇక ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతి సినిమాలోనూ వీరిద్దరు నటించారు. అయితే ఇందులో స్నేహ వెంకటేశ్ భార్యగా నటించగా.. శ్రీకాంత్ వెంకీ తమ్ముడిగా కనిపించారు. అంటే సంక్రాంతి సినిమాలో శ్రీకాంత్ వదినగా నటించింది స్నేహ. సంప్రదాయ పద్దతిగా, చూడచక్కని నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న స్నేహ… ఇప్పుడు అక్క, వదిన పాత్రలు పోషిస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తుంది. అంతేకాకుండా సొంతంగా చీరల బిజినెస్ స్టార్ట్ చేసింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..