Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hari Hara Veeramallu Trailer: హరి హర వీరమల్లు ట్రైలర్ అదిరిపోయిందిగా.. యోధుడిగా పవన్ కళ్యాణ్ ..

పవర్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో హరి హర వీరమల్లు ఒకటి. చాలా కాలం క్రితమే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సినిమా అప్డేట్స్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా అభిమానులకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Hari Hara Veeramallu Trailer: హరి హర వీరమల్లు ట్రైలర్ అదిరిపోయిందిగా.. యోధుడిగా పవన్ కళ్యాణ్ ..
Hari Hara Veeramallu (2)
Rajitha Chanti
|

Updated on: Jul 03, 2025 | 11:24 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో హరి హర వీరమల్లు ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలం క్రితమే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో పవన్ జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఎట్టకేలకు విడుదల చేసింది చిత్రయూనిట్. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అదిరిపోయింది. ముఖ్యంగా యోధుడిగా పవన్ కళ్యామ్ మ్యానరిజం, డైలాగ్ డెలివరీ అదిరిపోయింది.

దాదాపు మూడు నిమిషాల 1 సెకను నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన ఎలివేషన్ సీన్స్ మరింత హైలెట్ అయ్యాయి. ఈ చిత్రానికి మొదట క్రిష్ దర్శకత్వం వహించగా.. ఆ తర్వాత నిర్మాత ఏ.ఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, అనుపమ్ కేర్, సత్యరాజ్ వంటి ప్రముఖులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను జూలై 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్న సంధ్య థియేటర్లో ట్రైలర్ స్క్రీనింగ్ ప్లాన్ చేసింది చిత్రయూనిట్. కానీ జూలై 2న ఉదయం ఎంట్రీ పాస్ ల కోసం భారీగా అభిమానులు రావడం.. పరిస్థితి నియంత్రణ చాలా కష్టమైంది. దీంతో భద్రతా కారణాలతో ట్రైలర్ స్క్రీనింగ్ రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి..

Prabhas : ప్రభాస్ విషయంలో మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..

Nayanthara : ఆ స్టార్ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. నన్ను చెత్తగా చూపించారు.. నయనతార కామెంట్స్..

Tollywood: చేసేది సీరియల్స్.. స్టార్ హీరోలను మించి ఆస్తులు సంపాదించిన బ్యూటీ.. ఎవరంటే..

Telugu Cinema: అప్పుడు సీరియల్లో పద్దతిగా.. ఇప్పుడు ఇలా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?