- Telugu News Photo Gallery Cinema photos Do You Remember This Actress in This Photo, She Is Guppedantha Manasu Serial Fame Jyothi Poorvaj
Telugu Cinema: అప్పుడు సీరియల్లో పద్దతిగా.. ఇప్పుడు ఇలా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?
బుల్లితెరపై ఒకే ఒక్క సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది జ్యోతి పుర్వాజ్. చీరకట్టులో సంప్రదాయంగా.. హుందాతనంతో కనిపించి సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఆమెకు ఫ్యామిలీ అడియన్స్ నుంచి మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ అరాచకం సృష్టిస్తుంది. ఇంతకీ ఆమెను గుర్తుపట్టారా..?
Updated on: Jul 02, 2025 | 1:58 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ? పింక్ చీరలో గ్లామర్ టచ్ ఇస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఆమె బుల్లితెరపై చాలా ఫేమస్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే జ్యోతి పుర్వాజ్. బుల్లితెరపై జగతి మేడమ్ పాత్రతో ఎక్కువగా పాపులర్ అయ్యింది.

గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది జ్యోతి పుర్వాజ్. ఇందులో జగతి మేడమ్ పాత్రలో సంప్రదాయంగా కనిపిస్తూ సహజ నటనతో కట్టిపడేసింది. దీంతో ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఇక ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది.

శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి వినూత్న చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు పూర్వాజ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తుంది. అదే కిల్లర్. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో పూర్వాజ్ హీరోగా నటించగా.. జ్యోతి పుర్వాజ్ కథానాయికగా నటిస్తుంది. ఇదివరకు విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది.

ఈ సినిమాతోపాటు తెలుగులో మరిన్ని సినిమాల్లో నటిస్తుంది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ అలరిస్తుంది. తాజాగా పింక్ చీరకట్టులో గ్లామర్ లుక్స్ లో జ్యోతి పుర్వాజ్ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

కన్నడలో అనేక సీరియల్స్ చేసిన జ్యోతి.. ఇప్పుడు మాత్రం సినిమాలపై ఫోకస్ చేసింది. అలాగే వినూత్న సినిమాలతో అలరిస్తుంది. అయితే కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో గ్లామర్ అరాచకం సృష్టిస్తుంది జ్యోతి. మోడ్రన్ లుక్స్ తో మతిపోగొట్టేస్తుంది.




