Tollywood: 18 ఏళ్లకే ఇండస్ట్రీని ఊపేసింది.. 19 ఏళ్లకే పెళ్లి, పిల్లలు.. కట్ చేస్తే.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్..
ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అందరితో కలిసి నటించింది. నిజానికి బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. కట్ చేస్తే.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ సూపర్ హిట్ చిత్రంలో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ప్రేమించినవాడి కోసం సినిమాలు వదిలేసింది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె ఇప్పుడే చేస్తుందంటే. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక చిత్రాల్లో నటించింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. హిందీలో అగ్ర హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? బీటౌన్ ఇండస్ట్రీలో విలన్ పాత్రలతో పాపులర్ అయిన మురాద్ మనవరాలు భక్తవర్ ఖాన్ అలియాస్ సోనమ్ కాన్. 1972లో జన్మించిన ఆమె 1987లో వచ్చిన సామ్రాట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీతోనే సినీరంగంలోకి నటిగా అడుగుపెట్టింది. ఆ తర్వాత ఏడాదిలోనే బాలీవుడ్ సినీరంగంలో కెరీర్ స్టార్ట్ చేసింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
భక్తవర్ ఖాన్ ఆమె అసలు పేరు. కానీ డైరెక్టర్ యశ్ చోప్రా ఆమె పేరును సోనమ్ ఖాన్ గా మార్చారు. రెండేళ్లలో 20కి పైగా చిత్రాల్లో నటించిన సోనమ్.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రాలు చాలానే ఉన్నాయి. 1990లో మెగాస్టార్ చిరంజీవి సరసన కొదమ సింహం సినిమాలో నటించింది. చిరంజీవి మాత్రమే కాదు.. అమితాబ్ బచ్చన్, సన్నీడియోల్, సంజయ్ దత్, గోవింద వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది.
కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 19 ఏళ్ల వయసులో తనకంటే 17 ఏళ్లు పెద్దవాడైన డైరెక్టర్ రాజీవ్ రాయ్ ను పెళ్లి చేసుకుంది. వీరికి బాబు జన్మించాడు. అయితే తమ కొడుకు ఆటిజం సమస్యతో పుట్టడంతో ట్రీట్మెంట్ కోసం వెళ్లి యూరప్ లో సెటిల్ అయ్యారు. 2016లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది సోనమ్ ఖాన్.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..




