Tollywood: కమల్ పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్ ఆమెనే.. జీవితంలో అంతులేని దుఃఖాలు.. చివరకు..
ప్రేమ ఎప్పటికీ అంతంలేనిదే. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ప్రేమకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ కొన్ని ప్రేమలు విజయాన్ని సాధించలేవు. "ప్రేమ ఎప్పటికీ అంతం కాదు.. పెళ్లితో ప్రేమ ఎప్పటికీ అంతం కాదు.. దానికి అంతమే లేదు " అని గతంలో ఓ దర్శకుడు అన్నారు. ఈ మాట కమల్ హాసన్ జీవితానికి సరిగ్గా సరిపోతుంది.

సౌత్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోలలో కమల్ హాసన్ ఒకరు. ఎన్నో విభిన్నమైన చిత్రాలు.. అద్భుతమైన పాత్రలతో సినీప్రియులను అలరించారు. తెలుగు, తమిళంలో అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 70 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేస్తున్నారు. అయితే కమల్ జీవితంలో ప్రేమకు ఎప్పుడూ అంతం లేదు. జీవితంలో ఒక హీరోయిన్ ను అత్యంత పిచ్చిగా ప్రేమించాడు. కానీ తన ప్రియురాలిని పెళ్లి చేసుకోలేకపోయాడు. కానీ ఇప్పటికీ తన జీవితంలో ప్రేమ అంటే తనే అంటుంటారు కమల్. ఇంతకీ ఆయన ప్రేమించిన హీరోయిన్ ఎవరు.. ? ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుందామా.
కమల్ హాసన్ 1978లో భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి వాణి గణపతిని వివాహం చేసుకున్నాడు. కానీ వీరు పెళ్లైన పదేళ్లకు అంటే 1988లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి సారిక ఠాకూర్ ను 1988లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. 2004లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు నటి గౌతమితో సహజీవనం చేశారు కమల్. అయితే ఎప్పుడైన ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు అతడు చెప్పే ఏకైక పేరు శ్రీవిద్య. కమల్ హాసన్ తో విడిపోయిన తర్వాత ఎంతో బాధపడ్డానని గతంలో శ్రీవిద్య సైతం తెలియజేసింది. కమల్ హాసన్ తో తనకున్న సంబంధం తనను మానసికంగా ఎలా ప్రభావితం చేసిందో శ్రీవిద్య వెల్లడించింది.
వీరిద్దరు కలిసి అనేక చిత్రాల్లో నటించారు. అదే సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ గురించి యావత్ సినీ పరిశ్రమకే కాదు.. రెండు కుటుంబాల్లోనూ తెలిసిందే. ఇద్దరికీ పెళ్లి చేయాలనుకున్నారు. కానీ అప్పట్లో శ్రీవిద్య తల్లి వీరి పెళ్లికి 5 ఏళ్లు ఆగాలని చెప్పడంతో కమల్ అందుకు అంగీకరించలేదట. అప్పుడు కమల్ వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. శ్రీవిద్య తల్లి చెప్పడంతో వీరి ప్రేమ పెళ్లి పీటలెక్కలేదు. ఆ తర్వాత శ్రీవిద్యతో విడిపోయిన కమల్.. వెంటనే వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. కమల్ పెళ్లి విషయం తెలిసి తాను మానసిక ఎంతో కృంగిపోయానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
అయితే శ్రీవిద్య మరొకరిని పెళ్లి చేసుకుంది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. చాలా సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన శ్రీవిద్య.. అదే సమయంలో క్యాన్సర్ తో పోరాడింది. ఆమె చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తాను నటుడు కమల్ హాసన్‌ను మాత్రమే కలవాలనుకుంటున్నానని చెప్పింది. శ్రీవిద్య గురించి తెలుసుకున్న కమల్ హాసన్ తిరువనంతపురం వెళ్లి నటి శ్రీవిద్యను కలిశారు. 53 సంవత్సరాల వయసులో, శ్రీవిద్య అక్టోబర్ 19, 2006న శ్రీవిద్య మరణించింది.

Srividya
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..




