Rashmika Mandanna: మరో బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక.. ఈ సారి ఆ హ్యాండ్సమ్ హీరోతో రొమాన్స్
ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. అయితే ఇటీవల సల్మాన్ ఖాన్ తో కలిసి ఆమె నటించిన సికందర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇప్పుడు బాలీవుడ్ లో రష్మిక మందన్నకు మరో మంచి సినిమా అవకాశం వచ్చింది.

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా క్రేజీ ఆఫర్లు అందుకుంటోందీ అందాల తార. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ బ్యూటీకి వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ఇటీవల సల్మాన్ ఖాన్ తో కలిసి సికందర్ సినిమాలో నటించింది రష్మిక. రంజాన్ సందర్భంగా విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ఒక ఫ్లాప్ సినిమా వవచ్చినప్పటికీ, రష్మికకు ఇప్పుడు మరో మంచి బాలీవుడ్ సినిమా అవకాశం వచ్చింది. 2012లో విడుదలైన ‘కాక్‌టెయిల్’ సూపర్ హిట్ గా నిలిచింది. సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనే, డయానా పెంటీ నటించిన ఈ మల్టీ స్టారర్ మూవీ హిందీ ఆడియెన్స్ ను బాగా అలరించింది. ఒక మోడ్రన్ అమ్మాయి, ఒక ట్రెడిషినల్ లేడీ, ప్లేబాయ్ లాంటి అబ్బాయి మధ్య జరిగే ముక్కోణపు ప్రేమకథ గా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా ‘కాక్‌టెయిల్ 2′ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మికకు హీరోయిన్ పాత్ర ఇచ్చారు.
కాక్‌టెయిల్ 2’ చిత్రానికి లవ్ రంజన్ దర్శకత్వం వహిస్తుండగా, మ్యాడ్‌లాక్ విజయన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘కాక్‌టెయిల్’ లాగే, ‘కాక్‌టెయిల్ 2’ కూడా ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కనుంది. ఇందులో రష్మిక మందన్న ఒక కీలక పాత్రలో నటించనుంది. అలాగే కృతి సనన్ కూడా సెకెండ్ ఫిమేల్ లీడ్ గా యాక్ట్ చేస్తోంది. షాహిద్ కపూర్ ప్లే బాయ్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. కృతి సనన్, షాహిద్ కపూర్ ఇంతకు ముందు కలిసి నటించారు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ షాహిద్ కపూర్, కృతి సనన్ లతో రష్మిక నటించడం ఇదే మొదటిసారి. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.
జీ సినీ అవార్డ్స్ వేడుకలో రష్మిక డ్యాన్స్..
A little sneak peek of my performance at Zee Cine Awards 2025 for you my loves! 💃💛
Make sure to catch me live at Maruti Suzuki presents 23rd Zee Cine Awards 2025 on June 7th at 7:30 PM on Zee Cinema, Zee TV, and Zee5! ❤️✨#MarutiSuzukiZCA #ZCA2025 #ZeeCineAwards2025… pic.twitter.com/zRldRL8Yox
— Rashmika Mandanna (@iamRashmika) June 4, 2025
కాగా ఇప్పటికే బాలీవుడ్ లో ‘థామ’ అనే హారర్ కామెడీ సినిమా చేస్తోందీ రష్మిక. ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








