Tollywood: మెగా ఇంటికి కోడలు.. ఒకప్పుడు అక్కినేని హీరోకు ఫ్రెండ్, లవర్, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
సినీరంగంలో తొలి సినిమాతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అమాయకత్వంతో తెలుగు సినీప్రియులను కట్టిపడేసింది. సహజ నటనతో పక్కింటి అమ్మాయిల కనిపిస్తూనే వెండితెరపై మాయ చేసింది. ఇప్పుడు మెగా హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన నటుడు నాగచైతన్య. నాగార్జున నట వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన చైతూ.. జోష్ మూవీతో నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఏమాయ చేసావే సినిమాతో హిట్ అందుకున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న చైతూ.. ఇటీవలే తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. చైతన్య కెరీర్ లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఇది.ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. పీరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. సినీరంగంలో చైతుకు స్నేహితురాలిగా, ప్రేమికురాలిగా, తల్లిగా నటించిన టాలీవుడ్ ఏకైక హీరోయిన్ ఎవరో మీకు తెలుసా.. ? ఆమె ఎవరో కాదు.. లావణ్య త్రిపాఠి. అక్కినేని హీరోలు అందరూ కలిసి నటించిన మనం చిత్రంలో చైతూకు స్నేహితురాలిగా కనిపించింది. అలాగే వీరిద్దరు కలిసి యుద్ధం శరణం అనే చిత్రంలో నటించారు. అందులో చైతూ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించగా.. ఈ మూవీలో చైతూ ప్రేమికురాలిగా కనిపించింది లావణ్య.
ఇక వన్ ఆఫ్ ది హిట్ మూవీ బంగార్రాజు సినిమాలో నాగార్జున, లావణ్య దంపతుల కొడుకుగా చైతూను చూపించారు. అంటే ఇందులో చైతూకు తల్లి లావణ్య త్రిపాఠి అని అర్థం. తెలుగు సినీరంగంలో చైతూకు స్నేహితురాలిగా, లవర్ గా, తల్లిగా కనిపించిన ఏకైక హీరోయిన్ లావణ్య త్రిపాఠి. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని మెగా ఇంటికి కోడలిగా వెళ్లింది లావణ్య. ఈ జంట తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..




