AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 10 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. 2500 సినిమాల్లో నటించి స్టార్ డమ్.. చివరకు అగ్ని ప్రమాదంలో..

సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్ వంటి సీనియర్ హీరోల సినిమాల్లో నటించింది. టాలీవుడ్ హీరో మహేష్ బాబు సినిమాలోనూ కీలకపాత్ర పోషించింది. దక్షిణాది సినీరంగంలో దాదాపు 2500 పైగా చిత్రాల్లో నటించింది.ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఆమె.. ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood: 10 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. 2500 సినిమాల్లో నటించి స్టార్ డమ్.. చివరకు అగ్ని ప్రమాదంలో..
Actress
Rajitha Chanti
|

Updated on: May 20, 2025 | 9:43 PM

Share

సౌత్ ఇండస్ట్రీలో ఆమె తోపు నటి. రజినీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అంతేకాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కీలకపాత్ర పోషించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 2500కి పైగా చిత్రాల్లో నటించింది. సహజ నటనకు అనేక పురస్కారాలు గెలుచుకుంది. పదేళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. సీనియర్ నటిగా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కానీ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరెవరో కాదు.. పద్మ శ్రీ అవార్డ్ అందుకున్న దిగ్గజ నటి సుకుమారి. ఆమెను సుకుమారి అమ్మ అని కూడా పిలిచేవారు. దాదాపు 5 దశాబ్దాలుగా సినీరంగంలో యాక్టివ్ గా ఉంది. సుకుమారి 1940లో నాగర్‌కోయిల్‌లో జన్మించారు. తల్లిదండ్రులు మలయాళీలు. ఏడేళ్ల వయసు నుంచి ఆమె శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది.

భారత్, అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చింది. 1951లో పదేళ్ల వయసులో ‘ఒరు రాట్టు’ అనే సినిమాతో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాళీ, సింహళ భాషలలో దాదాపు 2500పైగా చిత్రాల్లో నటించింది. హాస్యం, భావోద్వేగ, విలన్ పాత్రలకు తన నటనతో ప్రాణం పోసింది. దశాబ్దాల సినీప్రయాణంలో ఎన్నో అవార్డులు గెలుచుకుంది. 2003లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మ శ్రీ అవార్డు ప్రకటించింది. 2010లో తమిళ చిత్రం నమ్మ గ్రామం చిత్రంలో ఆమె నటనకు జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. నాలుగు సార్లు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డ్స్ సొంతం చేసుకుంది.

తెలుగులో మహేష్ బాబు నటించిన మురారి చిత్రంలో బామ్మ పాత్రలో కనిపించింది. అంతేకాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్, వాణిజ్య ప్రకటనలు, రంగస్థల ప్రదర్శనలు ఇచ్చింది. రామసామి డ్రామా గ్రూప్ తో కలిసి ఆమె ఏకంగా 5000కి పైగా రంగస్థల ప్రదర్శనలు ఇచ్చారు. 1959లో ప్రముఖ దర్శకుడిని వివాహం చేసుకున్నారు. కానీ 1978లో ఆయన మరణించడంతో 38 ఏళ్లకే భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలింది. ఆమె కురుమారు సురేష్ భీమ్ సింగ్ పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం డాక్టర్ గా పనిచేస్తున్నారు.

ఇక సుకుమారి చివరి క్షణం వరకు సినిమాల్లో కొనసాగారు. 2013 ఫిబ్రవరిలో తన ఇంట్లో దీపం వెలిగిస్తుండగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 2013 మార్చి 26న తుదిశ్వాస విడిచారు.

Sukumari

Sukumari

ఇవి కూడా చదవండి :  

Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..