Vijay Deverakonda: శర్వానంద్ నో చెప్పాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ..
సాధారణంగా ఒక హీరో కోసం రాసుకున్న కథలు మరో హీరో వద్దకు చేరుతుంటాయి. కొన్నిసార్లు ఓ హీరో ఖాతాలో పడాల్సిన హిట్స్, ప్లాప్స్ మరో నటుడి ఖాతాలో పడుతుంటాయి. అలాగే యంగ్ హీరో శర్వానంద్ రిజెక్ట్ చేసిన కథతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడని మీకు తెలుసా.. ? ఆ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యారు విజయ్..

ప్రస్తుతం తెలుగు సినీరంగంలో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్. నిత్యం విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ముఖ్యంగా ఈ హీరోకు ఫ్యామిలీ అడియన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. కానీ మీకు తెలుసా.. ? శర్వానంద్ ఓ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నారు. ఆయన వద్దకు వచ్చిన ఓ సినిమా అవకాశాన్ని తిరస్కరించారు. ఆయన స్థానంలో హీరో విజయ్ దేవరకొండ నటించారు. కట్ చేస్తే ఆ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. ఆయన కెరీర్ ఒక్కసారిగా మార్చేసింది. ఇంతకీ శర్వానంద్ రిజెక్ట్ చేసిన సినిమా ఏంటో తెలుసా.. ? అదే అర్జున్ రెడ్డి. ఈ సినిమాను ముందుగా శర్వానంద్ తో తెరకెక్కించాలనుకున్నారట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ మేరకు ఆయనను సంప్రదించి కథ చెప్పారట.
కానీ ఆ సినిమాలో పాత్ర, కొన్ని అంశాలు తనకు సెట్ కాదని అనిపించాయని.. అందుకే ఆ మూవీకి నో చెప్పానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శర్వానంద్. ఆ హిట్ సినిమా మిస్సైనందుకు తాను బాధపడలేదని… ఎవరికి రాసిపెట్టి ఉన్న కథలు వారికే దక్కుతాయని తెలిపారు. ఆ దర్శకుడు మరోసారి తన వద్దకు వచ్చి అడగ్గా.. ఆ కథ మినహా ఏదైనా చేస్తానని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. దీంతో అర్జున్ రెడ్డి సినిమా అవకాశాన్ని మిస్సైయ్యారు శర్వానంద్.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు విజయ్. ఆ తర్వాత గీతా గోవిందం మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం విజయ్, శర్వానంద్ ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..
Tollywood: రస్నా యాడ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?
Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..



