Mass Jathara Movie: రవితేజ లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘మాస్ జాతర’. శుక్రవారం (అక్టోబర్ 31) న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. రవితేజ ఎనర్జీ, శ్రీలీల డ్యాన్సులు, ట్విస్టులు సినిమాలో హైలెట్ గా నిలిచాయని అంటున్నారు ఆడియెన్స్.

మాస్ మహారాజా రవితేజ చాలా రోజుల తర్వాత మరోసారి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించాడు. ఆయన నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాస్ జాతర. భాను భోగవరపు తెరకెక్కించిన ఈ సినిమాలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నవీన్ చంద్ర విలన్ గా ఆకట్టుకున్నాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్, నరేశ్, ప్రవీణ్, వీటీవీ గణేశ్, హైపర్ ఆది, అజయ్ ఘోష్, హిమజ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (అక్టోబర్ 31)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ అభిమానులు ఊహించిన స్థాయిలో లేనప్పటికీ రవితేజ ఎనర్జీ , ఫైట్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, శ్రీలీల అందచందాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కథలో కొత్త దనం లేనప్పటికీ ఆడియెన్స్ ను బాగానే మెప్పిస్తోంది. కాగా ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీసాఫీసర్ గా ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించాడు. చాలా రోజుల తర్వాత రవితేజ ను ఓ మంచి పాత్రలో చూశామని ఆడియెన్స్ అంటున్నారు. వింటేజ్ మాస్ మహారాజా కనిపించాడని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
అయితే మాస్ జాతర సినిమా కోసం ముందుగా అనుకున్న హీరో రవితేజ కాదట. అంతకన్నా ముందే డైరెక్టర్ భాను ఈ సినిమా కథ ను మరో హీరోకి వినిపించారట. ఆ హీరో మరెవరో కాదు మ్యాచో స్టార్ గోపీచంద్. అవును.. మాస్ జాతర సినిమాను మొదట గోపీచంద్ తో చేయాలని దర్శకుడు భావించాడట భాను. అయితే గోపీచంద్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ పై పెద్దగా ఆసక్తి చూపించలేకపోయాడట. దీంతో భాను ఆ కథని రవితేజ దగ్గరికి తీసుకురావడం, ఆ వెంటనే అతను ఓకే చెప్పడంతో మాస్ జాతర పట్టాలెక్కందట.
మాస్ జాతర సినిమాలో రవితేజ..
A complete commercial entertainment feast for everyone! 🔥🔥
Experience #MassJathara this weekend in theatres and be part of the celebration! 😎💥
Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/JC6KotM2DR
— Sithara Entertainments (@SitharaEnts) November 1, 2025
BLOCKBUSTER JATHARA Begins! 💥💥
Over 100K+ tickets sold on @bookmyshow even before the weekend picks up 🔥🔥🔥
Enjoy #MassJathara this weekend in cinemas! 😎🔥
Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya… pic.twitter.com/5tz5t2O6Uq
— Sithara Entertainments (@SitharaEnts) November 1, 2025
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి







