AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: చదివింది 10.. కానీ విమానాన్నే నడపగలడు.. అజిత్ గురించి ఈ విషయాలు తెలిస్తే అభిమాని అయిపోవాల్సిందే..

గతేడాది తెగింపు సినిమాతో థియేటర్లలో సందడి చేసిన అజిత్..ఇప్పుడు విడతల సినిమాలో నటిస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీ ఇప్పుడు వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఉన్నట్లుండి అజిత్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన మెదడులో బబుల్ ఉంది అనే ప్రచారం నడిచింది. అయితే ఈరూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు వైధ్యులు. అజిత్ మెదడులో బబుల్ లేదని.. కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆసుపత్రిలో చేరారంటూ వివరణ ఇచ్చారు.

Ajith Kumar: చదివింది 10.. కానీ విమానాన్నే నడపగలడు.. అజిత్ గురించి ఈ విషయాలు తెలిస్తే అభిమాని అయిపోవాల్సిందే..
Ajith Kumar
Rajitha Chanti
|

Updated on: Mar 10, 2024 | 12:54 PM

Share

ఇప్పుడున్న హీరోలందరిలో అజిత్ ప్రత్యేకం. తమిళ సినీ పరిశ్రమలో అగ్రకథానాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ సికింద్రాబాద్ కుర్రాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సవాళ్లు.. అడ్డంకులు.. అవమానాలను ఎదుర్కోని స్టార్ హీరోగా ఎదిగాడు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అజిత్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. హిట్టు, ప్లాపులను పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. గతేడాది తెగింపు సినిమాతో థియేటర్లలో సందడి చేసిన అజిత్..ఇప్పుడు విడతల సినిమాలో నటిస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీ ఇప్పుడు వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఉన్నట్లుండి అజిత్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన మెదడులో బబుల్ ఉంది అనే ప్రచారం నడిచింది. అయితే ఈరూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు వైధ్యులు. అజిత్ మెదడులో బబుల్ లేదని.. కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆసుపత్రిలో చేరారంటూ వివరణ ఇచ్చారు. నిజానికి ఆరోగ్యం, ఫిజికల్ ఫిట్ నెస్ విషయంలో అజిత్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తే నిజంగానే ఆయనకు అభిమాని అవుతారు.

అజిత్ కుమార్.. 1971 మే 1న సికింద్రాబాద్ లో జన్మించారు. ఆయన తండ్రి పి. సుబ్రమణ్యం కేరళకు చెందిన వ్యక్తి. అజిత్ కు అనిల్ కుమార్, అనుప్ కుమార్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. అజిత్ తండ్రి పి. సుబ్రమణ్యం గతేడాది మరణించారు. అజిత్‌కి చదువుపై పెద్దగా ఆసక్తి లేదు. కేవలం పదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. ఆ తర్వాత మెకానిక్ గా పనిచేశాడు. చదువులో ప్రావీణ్యం లేకపోయినా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీషు భాషలో అనర్గళంగా మాట్లాడతాడు. అంతేకాకుండా అతడు ప్రొఫెషనల్ రేసర్. 2004లో బ్రిటిష్ ఫార్ములా 3, ఫార్ములా 2 రేసుల్లో పాల్గొన్నాడు. అలాగే ఆయన ప్రొఫెషనల్ షూటర్. తమిళనాడులో జరిగిన ఒక ఛాంపియన్‌షిప్‌లో అజిత్ 4 బంగారు పతకాలు సాధించాడు.

ఇవే కాదు.. అజిత్ కు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ షూటింగ్ నుంచి బ్రేక్ దొరికితే బైక్ రేసింగ్ కు వెళ్తాడు. అలాగే ఆయనకు విమానం కూడా నడపగలడు. ఇప్పటికే విమానం నడపడం కోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. విమానం నడపడం వచ్చిన ఏకైక హీరో అజిత్ కావడం విశేషం. ఇప్పటికే బైక్ పై అనేక దేశాలను చుట్టేశాడు అజిత్. 2000లో తన సహనటి బేబి షాలినిని ప్రేమ వివాహం చేసుకున్నాడు అజిత్. నాలుగు పదులు వయసు దాటిన జుట్టు పూర్తిగా తెల్లరంగులోకి మారిపోయినా కలర్ మాత్రం వేసుకోడు. అలాగే ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం అద్భుతమైన టెక్నాలజీతో దూసుకుపోతున్నా.. ఇప్పటికీ తనకంటూ ఓ ఫోన్ కూడా ఉపయోగించడు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. 1992లో ప్రేమ పుస్తకం అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత తమిళంలో సెటిల్ అయ్యాడు అజిత్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.