Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఇది నిజంగా నేను నమ్మలేకపోతున్నాను.. అందుకు ఎదురుచూస్తుంటా.. ఆసక్తికర పోస్ట్ చేసిన ప్రభాస్..

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో కనిపించారు. ఇందులో ప్రభాస్, పృథ్వీరాజ్ ప్రాణస్నేహితులుగా కనిపించారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు పృథ్వీరాజ్. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఆడుజీవితం. బ్లెస్సీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని గోట్ డేస్ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Prabhas: ఇది నిజంగా నేను నమ్మలేకపోతున్నాను.. అందుకు ఎదురుచూస్తుంటా.. ఆసక్తికర పోస్ట్ చేసిన ప్రభాస్..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 10, 2024 | 12:28 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన కోత్త పోస్టర్ మూవీపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేసింది. ఈ మూవీ మే 9న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. అంతకు ముందు వరుస డిజాస్టర్స్ అందుకున్న ప్రభాస్ సలార్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో కనిపించారు. ఇందులో ప్రభాస్, పృథ్వీరాజ్ ప్రాణస్నేహితులుగా కనిపించారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు పృథ్వీరాజ్. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఆడుజీవితం. బ్లెస్సీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని గోట్ డేస్ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 28న ఈ సినిమాను తెలుగు, మలయాళీం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే నిన్న ఆడు జీవితం ట్రైలర్ రిలీజ్ చేశారు.

కేరళకు చెందిన ఓ యువకుడడు ఉద్యోగం సౌదీ అరేబియాకు వెళ్తాడు. అక్కడ తనను బానిసగా చూస్తారు.. ఎన్నో సమస్యలు.. కష్టాలను ఎదుర్కొంటాడు. దీంతో అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు. అలా ఎడారి గుండా నడక ప్రారంభిస్తాడు. ఆ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు.. కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి. చివరకు అతడు భారత్ చేరుకున్నాడా ?.. లేదా ? అనేది సినిమా. ఇందులో పృథ్వీరాజ్ మరోసారి తన అద్భుతమైన నటన కనబరిచాడు. గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు. నిన్న విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే ఆడు జీవితం ట్రైలర్ ప్రభాస్ రియాక్ట్ అయ్యారు.

Prabhas, Prithviraj

Prabhas, Prithviraj

తన స్నేహితుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య జరిగిన సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటుంది. “నేను చూస్తుంది వరదరాజ మన్నార్ గా నటించిన వ్యక్తినా ! ఇది నేను నమ్మలేకపోతున్నాను. పృథ్వీ మీరు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. మంచి విజయం సాధిస్తుంది. మీకు అభినందనలు. ” అంటూ పోస్ట్ చేశారు ప్రభాస్. ఇక ప్రభాస్ పోస్టుకు బదులిస్తు ధన్యవాదాలు దేవా.. త్వరలోనే యుద్ధభూమిలో కలుద్దాం అంటూ మలయాళీ నటుడు పృథ్వీరాజ్ రిప్లై ఇచ్చారు.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.