Shilpa Shetty : అయ్యో పాపం.. సాగరకన్యను అన్ని మాటలు అన్నారా ?.. అతడిని పెళ్లి చేసుకుంటే అంతేనా ఇక..
చాలా సంవత్సరాలపాటు హిందీ చలనచిత్ర పరిశ్రమలో చక్రం తిప్పిన ఈ బ్యూటీ..ఇప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. వెబ్ సిరీస్, రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తు స్మాల్ స్క్రిన్ పై సందడి చేస్తుంది. అయితే శిల్పా సినిమా గురించి కాకుండా ఆమె వ్యక్తిగత జీవితం గురించి నిత్యం నెట్టింట చర్చ జరుగుతుంటుంది. ముఖ్యంగా శిల్పా, రాజ్ కుంద్రా పెళ్లి గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తుంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిల్పా రాజ్ కుంద్రాతో తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.
సాహసవీరుడు సాగరకన్య సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బీటౌన్ బ్యూటీ శిల్పాశెట్టి. చేప కళ్లతో ఎంతో అందంగా కనిపించి అప్పట్లో తెలుగు యువతకు ఫేవరేటే హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుని స్టార్ డమ్ సంపాదించుకుంది. చాలా సంవత్సరాలపాటు హిందీ చలనచిత్ర పరిశ్రమలో చక్రం తిప్పిన ఈ బ్యూటీ..ఇప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. వెబ్ సిరీస్, రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తు స్మాల్ స్క్రిన్ పై సందడి చేస్తుంది. అయితే శిల్పా సినిమా గురించి కాకుండా ఆమె వ్యక్తిగత జీవితం గురించి నిత్యం నెట్టింట చర్చ జరుగుతుంటుంది. ముఖ్యంగా శిల్పా, రాజ్ కుంద్రా పెళ్లి గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తుంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిల్పా రాజ్ కుంద్రాతో తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. రాజ్ కుంద్రాను తాను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకోలేదని.. రాజ్ కుంద్రా కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న సంపన్నులు తనను పెళ్లి చేసుకోవడానికి వచ్చారని చెప్పుకొచ్చింది.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిల్పాను ఉద్దేశిస్తూ.. రాజ్ కుంద్రాను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నారని అన్నారు.. వాటిపై మీ సమాధానం ఏంటీ ? అని ప్రశ్నించగా.. శిల్పా మాట్లాడుతూ.. “పెళ్లికి ముందు నేను ధనవంతురాలిని అనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కావడం లేదు. పెళ్లికంటే ముందు నా ఆర్థికస్థితి గురించి గూగుల్ చేయడం మార్చిపోతున్నారు. కానీ ఓ మహిళా సొంతంగా సంపాదిస్తూ విజయం సాధించనప్పుడు .. ఆమెకు భద్రత కలిగించే వ్యక్తి కావాలి. తనపై ప్రేమ చూపించే మనిషి కావాలి. రాజ్ మంచి వ్యక్తి కాకపోతే నేను పెళ్లి చేసుకోను కదా.. అతడి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న ధనవంతులు కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ మా ఇద్దరికి స్నేహితుల ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మేము కలిసి జీవించాలనుకున్నప్పుడు దేవుడి నిర్ణయం అనుకున్నాం ” అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే ఆదాయపు పన్ను, జీఎస్టీ ఇలా ప్రతి విషయంలో ఇరుక్కుపోయానని స్పష్టం చేసింది. తన రెస్టారెంట్‌కు సంబంధించి వైరల్‌గా మారిన రీల్స్ గురించి ప్రశ్నించగా.. అవన్ని అసత్యాలే అని అన్నారు శిల్పా. రాజ్ కుంద్రా పేరు వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ శిల్పా అతడిని ఎందుకు పెళ్లి చేసుకుంది అనే సందేహాలు ఇప్పటికీ వ్యక్తమవుతుంటాయి. చాలా కాలం స్నేహితులుగా ఉన్న రాజ్ కుంద్రా శిల్పా 2009లో నవంబర్ లో రాజ వేడుకలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.