Upendra: ఉపేంద్ర భార్య కూడా క్రేజీ హీరోయినా! తెలుగులో ఆ స్టార్ హీరోల సినిమాల్లో నటించిందని తెలుసా?
తెలుగు సినిమా ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటుడు ఉపేంద్ర. పేరుకు కన్నడ హీరోనే అయినప్పటికీ తెలుగులోనే ఈ యాక్టర్ కు బోలెడెంత మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు సపోర్టింగ్ రోల్స్ లో మెరుస్తున్నాడు ఉపేంద్ర.
ఎవరికీ అందని వెరైటీ కాన్సెప్టులతో సినిమాలు తీస్తుంటాడు, నటిస్తుంటాడు హీరో ఉపేంద్ర. ఓమ్, ఏ, రా, ఉపేంద్ర, హెచ్ 2ఓ.. ఇలాంటి తదితర సినిమాలో చెబుతాయి ఉపేంద్ర ఎంతటి ట్యాలెంటెడ్ నటుడో, డైరెక్టరో అని. మాజంలోని లోపాలను ఎత్తిచూపిస్తూ.. సెటైరికల్‌గా అదే సమయంలో ఎంటర్‌టైనింగ్ ఉండేలా ఆయన సినిమాలు రూపొందిస్తుంటాడు. అందుకే ఇప్పటికీ ఉప్పీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆయన సినిమాలు రిలీజవుతున్నాయంటే తెలుగులోనూ థియేటర్లు కళకళలాడుతాయి. కేవలం హీరోగానే కాదు.. సన్నాఫ్ సత్యమూర్తీ, గని వంటి సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్టుగా సినిమాలు చేశాడు. 56 ఏళ్ల ఉపేంద్ర తన 25 ఏళ్ల సినిమా కెరీర్ లో సుమారు 60 కు పైగా సినిమాల్లో నటుడిగా మెప్పించాడు. అలాగే పదుల సంఖ్యలో సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇలా మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉపేంద్ర. ఇక చాలా రోజుల తర్వాత ఉప్పీ మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహిస్తోన్న యూఐ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.
అన్నట్లు ఉపేంద్ర మాత్రమే కాదు ఆయన సతీమణి కూడా క్రేజీ హీరోయినే. తెలుగులో కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆమె మరోవరో కాదు ప్రియాంక త్రివేది. ఇలా పేరు చెబితే గుర్తుకు రాకపోవచ్చు కానీ జేడీ చక్రవర్తి నటించిన సూరి సినిమా హీరోయిన్ అంటే చాలా మందికి మైండ్ లో స్ట్రైక్ అవుతుంది. దీంతో పాటు ఉపేంద్ర హీరోగా నటించిన రా, హెచ్ 2ఓ సినిమాల్లో కూడా ప్రియాంకనే హీరోయిన్ గా నటించింది. నిజానికి ఈ అందాల తార 50 కు పైగా సినిమాల్లో నటించింది. కన్నడ, తమిళ్, బెంగాలీ భాషల్లో ఎక్కువగా నటించింది. గతేడాది ప్రియాంక నటించిన 50వ సినిమా డిటెక్టీవ్ తీక్షణ రిలీజైంది. ఇటీవలే ఉగ్రావతారం అనే సినిమాలోనూ మెయిన్ లీడ్ లో కనిపించింది ప్రియాంక.
భర్త ఉపేంద్రతో ప్రియాంక..
View this post on Instagram
సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ లో అదృష్టం పరీక్షించుకుంది ప్రియాంక. మిస్ కోల్ కతా కిరీటం కూడా సొంతం చేసుకుంది. ఇక ఉపేంద్ర, ప్రియాంకల వివాహం 2003లో జరిగింది.
ఉపేంద్ర- ప్రియాంకల ఫొటో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.