Tollywood: నటి శ్రీలక్ష్మి మేనకోడలు ఇండస్ట్రీలో చాలా స్పెషల్.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినీరంగంలో కొన్ని దశాబ్దాలుగా తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి శ్రీలక్ష్మి. తెలుగులో టాప్ లేడీ కమెడియన్లలో ఆమె ఒకరు. ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె.. ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు.

Tollywood: నటి శ్రీలక్ష్మి మేనకోడలు ఇండస్ట్రీలో చాలా స్పెషల్.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 17, 2024 | 11:47 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ లేడీ కమెడియన్లలో శ్రీలక్ష్మి ఒకరు. ఎంతో మందికి ఆమె రోల్ మోడల్. ఒకప్పుడు తనదైన నటనతో ప్రేక్షకుల పొట్టచెక్కలయ్యేలా నవ్వించావాళ్లు. వెండితెరపై ఆమె కనిపించగానే అడియన్స్ పెదవులపైకి చిరునవ్వు వచ్చేది. హాస్యనటిగానే కాకుండా.. కథానాయికగానూ అలరించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో నటించి మెప్పించింది. తెలుగులో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఆమెకు కథానాయికగా ఆఫర్స్ కాకుండా నటిగానే ఆఫర్స్ ఎక్కువగా వచ్చేవట.

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సీనియర్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీలక్ష్మి నటించిన చిత్రాల్లో చంటబ్బాయ్ మూవీ గురించి చెప్పక్కర్లేదు. అలాగే నటి శ్రీలక్ష్మిని చూడగానే ‘బాబు.. చిట్టి ‘ అనే డైలాగ్ గుర్తోస్తుంది. ఇప్పటికీ ఆమె పోషించిన పాత్రలు చాలా ఫేమస్. శ్రీవారికి శుభలేఖ, కలెక్టర్ గారి అబ్బాయి, బంధవులొస్తున్నారు జాగ్రత్త, మాయలోడు, శుభలగ్నం వంటి చిత్రాలతో కడుపుబ్బా నవ్వించారు. నటి శ్రీలక్ష్మి తమ్ముడు రాజేశ్ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యాడు. పల్లెటూరి మొనగాడు, రెండు రెళ్ల సీత, బొబ్బిలి బ్రహ్మన్న వంటి చిత్రాల్లో నటించాడు. అతడు మరణించిన తర్వాత ఆయన ఫ్యామిలీ ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది.

ఇవి కూడా చదవండి

కానీ ఇప్పుడు రాజేశ్ కూతురు, నటి శ్రీలక్ష్మి మేనకోడలు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఆమె మరెవరో కాదు. హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. తెలుగు, తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్ సరసన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో నటిస్తుంది.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.