Ram Charan: ఎయిర్ పోర్ట్లో రామ్ చరణ్ ధరించిన వాచ్ ధరెంతో తెలుసా ?.. సింపుల్గా కనిపిస్తోన్న ఎక్కువే..
మొదటిసారి పొలిటికల్ నాయకుడిగా కనిపించనుండడంతో గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల తన కూతురితో సమయం గడిపేందుకు దాదాపు 3 నెలలు షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న చరణ్.. కొద్ది రోజుల క్రితం తిరిగి సెట్ లో అడుగుపెట్టారు. అయితే సెప్టెంబర్ 5న తన భార్య ఉపాసనతో కలిసి విదేశాలకు వెళ్లారు చరణ్. ఆ సమయంలో హైదరాబాద్ విమానాశ్రయంలో వీరిద్దరికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో మునుపెన్నడు కనిపించని సరికొత్త లుక్లో చరణ్ కనిపించనున్నారు. అంతేకాకుండా మొదటిసారి పొలిటికల్ నాయకుడిగా కనిపించనుండడంతో గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల తన కూతురితో సమయం గడిపేందుకు దాదాపు 3 నెలలు షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న చరణ్.. కొద్ది రోజుల క్రితం తిరిగి సెట్ లో అడుగుపెట్టారు. అయితే సెప్టెంబర్ 5న తన భార్య ఉపాసనతో కలిసి విదేశాలకు వెళ్లారు చరణ్. ఆ సమయంలో హైదరాబాద్ విమానాశ్రయంలో వీరిద్దరికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
ఆ సమయంలో రామ్ చరణ్ బ్లాక్ టీ షర్ట్.. ముదురు నీలం ప్యాంటుతో సింపుల్ స్టైలిష్ గా కనిపించారు. ముఖ్యంగా చరణ్ చేతికి ఉన్న వాచ్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. చరణ్ ధరించిన వాచ్ SWATCH X OMEGA మిషన్ టు మెర్క్యూరీ టైమ్ పీస్. దీని విలువ $270 Dx’s oeoehg 22,000. ఈ సున్నితమైన టైమ్ పీస్ స్విస్ సింపుల్, స్టైలీష్ లుక్ తోపాటు.. గాంభీర్యాన్ని మిళితం చేసింది. ప్రస్తుతం చరణ్, ఉపాసన ఫోటోస్ వైరలవుతున్నాయి.
View this post on Instagram
ఇదిలా ఉంటే చరణ్ .. గేమ్ ఛేంజర్ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమా రా అండ్ రస్టిక్ ఫిల్మ్ అని గతంలో చెప్పేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. అంటే ఇందులో చరణ్ పాత్ర చాలా మాసివ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు.. రెండో సినిమానే చెర్రీని దర్శకత్వం చేసే ఛాన్స్ కొట్టేశారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




