Sitara Ghattamaneni: ముద్ద మందారంలా మెరిసిన మహేష్ తనయ.. సితార డ్రెస్ ధర తెలిస్తే షాకే..
మొదటిసారి ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ కోసం కమర్షియల్ యాడ్ చేయడం.. ఆ రెమ్యునరేషన్ మొత్తాన్ని మహేష్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వడంతో సీతూపాప మంచి మనసుపై ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత తన బర్త్ డే సందర్భంగా కొందరు విద్యార్థినీలకు సైకిళ్లు బహుమతిగా అందించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సితార.. తనకు నటన పట్ల ఆసక్తి ఉందని చెప్పడంతో త్వరలోనే సీతూపాప తెరంగేట్రం చేయబోతుందని టాక్ వినిపిస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని గురించి చెప్పక్కర్లేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవల కొద్ది రోజులుగా సితార గురించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. మొదటిసారి ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ కోసం కమర్షియల్ యాడ్ చేయడం.. ఆ రెమ్యునరేషన్ మొత్తాన్ని మహేష్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వడంతో సీతూపాప మంచి మనసుపై ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత తన బర్త్ డే సందర్భంగా కొందరు విద్యార్థినీలకు సైకిళ్లు బహుమతిగా అందించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సితార.. తనకు నటన పట్ల ఆసక్తి ఉందని చెప్పడంతో త్వరలోనే సీతూపాప తెరంగేట్రం చేయబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సితార మాత్రం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది.
సితార కొద్ది రోజులుగా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన డాన్స్ వీడియోస్ నెట్టింట పంచుకుంది. ఇక ప్రతిసారి తన అద్భుతమైన స్టైల్ స్టేట్‌మెంట్‌లతో తన అభిమానులను తరచుగా మంత్రముగ్దులను చేస్తుంది. దసరా సందర్భంగా గార్భా డాన్స్ వీడియో షేర్ చేయగా.. తెగ వైరలయ్యింది. ఇక అదే సమయంలో విజయ దశమి సందర్భంగా ఎరుపు రంగు లెహాంగాలో మరింత అద్భుతంగా ముస్తాబయ్యింది సితార. ఆమెకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దసరా శుభ సందర్భంగా మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని తన ఇన్‌స్టాగ్రామ్ లో తన లుక్‌కి సంబంధించిన చిత్రాలను షేర్ చేసింది.
View this post on Instagram
సితార తన రెడ్ కలర్ లెహంగాను మ్యాచింగ్ బ్లౌజ్‌తో స్టైల్ చేసింది. ఇందులో క్రిస్-క్రాస్ టై వివరాలు, స్కాలోప్డ్ హెమ్‌లైన్ ఉన్నాయి. ఆమె తన దుస్తులకు అందమైన ఆర్గాన్జా దుపట్టాను జోడించింది. దానిలో ఆమె దుస్తుల మొత్తం రూపాన్ని ఎలివేట్ చేయడానికి పూల పనిని కలిగి ఉంది. సితార లెహంగా, బ్లౌజ్‌లో గాజు పూసలు, స్ఫటికాలు, రాళ్లు, కట్‌వర్క్ వివరాలు ఉన్నాయి. సితార ముత్యాలు, కుందన్ పనిని కలిగి ఉన్న స్టేట్‌మెంట్ చోకర్ ధరించింది.
సితార ధరించిన ఎరుపు రంగు లెహంగా ఏ అమ్మాయికైనా సరిగ్గా సరిపోతుంది. పండుగల నుండి పెళ్లిళ్ల వరకు, అమ్మాయిలు ప్రతి సందర్భంలోనూ ఈ అందమైన దుస్తులను ధరించవచ్చు. కానీ ఆ లెహంగా ధర తెలిస్తే ముందు షాకవ్వడం ఖాయం. అవును.. సితార ధరించిన లెహంగాను డిజైనర్ వరుణ్ చక్కిలం డిజైన చేసినట్లు తెలుస్తోంది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఆ లెహంగా ధర రూ. 2,10,000. ప్రస్తుతం ఈ లెహంగాకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.