Allu Arjun Pushpa 2: మళ్లీ థియేటర్లలోకి ‘పుష్ప 2’.. ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ ఫ్యామిలీ.. వీడియో
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి 2 రికార్డులను సైతం అధిగమించిన ఈ మూవీ అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో భారతీయ సినిమాగా నిలిచింది. ఇప్పుడీ మూవీ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ బాహుబలి 2 రికార్డులను సైతం బద్దలు కొట్టింది. 2వేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో భారతీయ సినిమాగా రికార్డుల కెక్కింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఫహాద్ పాజిల్, సునీల్, అనసూయ తదితరులు ప్రధాన పాత్రలు మెరిశారు. లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో మెరవడం విశేషం. రిలీజైన అన్ని భాషల్లోనూ భారీ విజయం సాధించిన పుష్ప 2 ఇప్పుడు జపాన్ లో రిలీజ్ కాబోతుంది. జనవరి 16న ‘పుష్ప కున్రిన్’ పేరుతో జపాన్ ఆడియెన్స్ ముందుకు రానుంది.
ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా హీరో అల్లు అర్జున్ జపాన్ రాజధాని టోక్యోకు చేరుకున్నారు. అతని వెంట భార్య స్నేహారెడ్డి పిల్లలు అయాన్, అర్హ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యామిలీకి టోక్యోలో ఘన స్వాగతం లభించింది. అభిమానులు భారీ సంఖ్యలో ఎయిర్ పోర్టుకు వచ్చి బన్నీ కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
టోక్యోలో అల్లు అర్జున్ ఫ్యామిలీ.. వీడియో..
Icon star #alluarjun land in Japan welcome 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 #Pushpa2TheRule #Pushpa2InJapan pic.twitter.com/lE4O004AGL
— Allu shan dhanush (@subramanyams755) January 13, 2026
కాగా పుష్ప 2 సినిమాలో జపాన్ నేపథ్యం కూడా ఉంది. కాబట్టి అక్కడి ప్రేక్షకులకు ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా జపాన్ ప్రజలకు ఎర్రచందనంతో ప్రత్యేక అనుబంధం ఉంది కాబట్టి పుష్ప 2కు మంచి వసూళ్లు రావొచ్చని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.
జపాన్ లో పుష్ప 2 సినిమా పోస్టర్స్..
Pushpa2 japan release posters 🤩🔥 @alluarjun #プシュパ君臨#Pushpa2InJapan pic.twitter.com/poHlo3ON6n
— Bunny Mailapalli (@BunnyMailapalli) January 13, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




