జాన్వీ పక్కన ఉన్న పాపను గుర్తుపట్టారా.? ఆమె కోసం నెటిజన్స్ గూగుల్‌ను గాలించేస్తున్నారు
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఎన్టీఆర్. దేవర లాంటి విజయం తర్వాత ఎన్టీఆర్ నటించిన వార్ 2 ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అలాగే దేవర 2లోనూ నటించనున్నాడు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. చివరిగా ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించలేకపోయింది. ఇక ఇప్పుడు కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నాడని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రెండో మూవీ ఇది.
యాక్షన్ ఎంటర్ టైనర్ దేవర థియేటర్స్‌లో కుమ్మేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన దేవర సినిమా పై మొదటి నుంచి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా హిట్ అవడంతో తారక్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తారక్ తన నటనతో పాటు యాక్షన్ తో ఇరగదీశాడు. థియేటర్స్ లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. మొత్తంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది దేవర సినిమా..
ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ సెట్ చేసింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించి మెప్పించాడు. ఇక దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించాడు. ఎన్టీఆర్‌తో సహా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, గెటప్ శ్రీను ఇలా చాలా మంది నటించారు. దేవర సినిమాలోని ‘దావూది వాదీ’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట్లో ఈ సాంగ్ థియేటర్స్ లో లేదు.. ఆతర్వాత ఈ సాంగ్ ను యాడ్ చేశారు. ఇదిలా ఉంటే దావూది వాదీ సాంగ్ లో జాన్వీ డాన్స్ ఇరగదీసింది. జాన్వీతోపాటు సైడ్ డాన్సర్స్ కూడా డాన్స్ అదరగొట్టారు. వీరిలో ఓ అమ్మాయి మాత్రం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. చాలా మంది ఆమె ఎవరు అంటూ సోషల్ మీడియాలో తెగ గాలించారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ కోసం తెగ వెతికేశారు. ఆమె డాన్స్ తో పాటు తన అందంతోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. చాలా సినిమాల్లో ఆమె సైడ్ డాన్సర్ గా చేసింది. ఆమె పేరు సిమ్రన్ వెర్మ. ఈ అమ్మడి ఫోటోలు, వీడియోల పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




