AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిరపకాయ్‌లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? చూస్తే షాక్ అవ్వాల్సిందే

2011న విడుదలై ఘనవిజయం సాధించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ మూవీలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించారు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ క్రేజ్ పెరిగిపోయింది. అటు తమన్ కు కూడా మంచి డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన అమ్మాయి గుర్తుందా..?

మిరపకాయ్‌లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? చూస్తే షాక్ అవ్వాల్సిందే
Mirapakay
Rajeev Rayala
|

Updated on: Mar 16, 2024 | 7:14 PM

Share

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ సినిమా మిరపకాయ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో రవితేజకు జోడీగా రిచా గంగోపాధ్యాయ్ నటించి మెప్పించింది అలాగే మరో హీరోయిన్ గా దీక్షా సేథ్ నటించింది. 2011న విడుదలై ఘనవిజయం సాధించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ మూవీలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించారు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ క్రేజ్ పెరిగిపోయింది. అటు తమన్ కు కూడా మంచి డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన అమ్మాయి గుర్తుందా..?

ఈ ముద్దుగుమ్మ డిఫరెంట్ వాయిస్‌తో కుర్రకారును ఆకట్టుకుంది. ఆమె పేరు స్నిగ్థ. ఈ అమ్మడు సినిమాలో కనిపించింది తక్కువ సేపే అయినా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. చూడటానికి చక్కగా ఉండే ఈ అమ్మడు వాయిస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ వాయిస్ తోనే కుర్రాళ్లను కట్టిపడేసింది.

అయితే మిరపకాయ్ సినిమా తర్వాత ఆ చిన్నది సినిమాలకు దూరం అయ్యింది. మిరపాయ్ సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు ఈ బ్యూటీ. సోషల్ మీడియాలోనూ ఎక్కడా కనిపించడం లేదు స్నిగ్థ. కానీ ఈ అమ్మడి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమాలోని హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ కూడా సినిమాలకు దూరం అయ్యింది. ఆ అమ్మడు పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆమె ప్రస్తుతం ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో నివసిస్తోంది. వెంకటేష్ దగ్గుబాటి, రవితేజ, ప్రభాస్, రానా దగ్గుబాటి, ధనుష్, సిలంబరసన్ లాంటి ప్రముఖ నటులతో కలిసి నటించింది రిచా గంగోపాధ్యాయ్.

Snigdha 1

స్నిగ్థ

Snigdha

రిచా గంగోపాధ్యాయ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.