సినిమాలు దూరమవ్వడానికి అతనే కారణం..నన్ను తప్పుగా వాడుకోవాలనుకున్నారు: కిరణ్ రాథోడ్
తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ నటించింది ఈ వయ్యారి. చాలా వరకు స్పెషల్ సాంగ్స్ లోనే ఆడిపాడింది ఈ బ్యూటీ. స్టార్ హీరోలు దళపతి విజయ్, కమల్ హసాన్ లాంటి స్టార్ హీరోలతో కలిసి స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొంది కిరణ్ రాథోడ్. బిగ్ బాస్ సీజన్ 7 లో మొదటి వారంలోనే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది.

నువ్వు లేక నేను లేను సినిమా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ కిరణ్ రాథోడ్. ఈ అందాల భామ హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్ గానే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంది. స్పెషల్ సాంగ్స్ లో అదరగొట్టింది కిరణ్ రాథోడ్.. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ నటించింది ఈ వయ్యారి. చాలా వరకు స్పెషల్ సాంగ్స్ లోనే ఆడిపాడింది ఈ బ్యూటీ. స్టార్ హీరోలు దళపతి విజయ్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో కలిసి స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొంది కిరణ్ రాథోడ్. బిగ్ బాస్ సీజన్ 7 లో మొదటి వారంలోనే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ తిరిగి సినిమాల్లో బిజీ కావాలని ప్రయత్నాలు చేస్తోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ రాథోడ్.. తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను సినిమాలకు దూరం అవ్వడానికి గలా కారణం తెలిపింది కిరణ్ రాథోడ్ తన ప్రియుడు చెప్పడంతోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చానని.. అతను సినిమాలను వదిలేయమన్నాడని తెలిపింది. అయితే అతని మాటలు విని చాల పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రావాలని ట్రై చేస్తున్నా అని తెలిపింది.
అయితే ఇప్పుడు సినిమాల్లో ట్రై చేస్తుంటే తనను కొంతమంది తప్పుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అని తెలిపింది. ఆఫర్స్ కోసం వెళ్తే అడ్జెస్ట్‌మెంట్ అడుగుతున్నారు అని చెప్పుకొచ్చింది కిరణ్ రాథోడ్. ఇలాంటి కష్టసమయంలోనే తన ప్రియుడు వదిలేశాడు అని ఎమోషనల్ అయ్యింది. ఒకసారి తన ప్రియుడు తనను కొట్టాడని.. అది తట్టుకోలేక.. ఒకరోజు అతనికి ఫోన్ చేసి రమ్మని పిలిచి కసితీరా కొట్టి పంపించాను అని తెలిపింది. ఆతర్వాత తనకు చాలా మంది ఫోన్ చేసి పిచ్చిపిచ్చిగా మాట్లాడారని.. తప్పుడు ఉద్దేశంతో తనను వాడుకోవాలనుకున్నారని తెలిపింది. ఇలాంటి వాటి వల్లే తనకు సినిమా అవకాశాలు దూరం అయ్యాయి అని తెలిపింది కిరణ్ రాథోడ్.
Bekyk hierdie plasing op Instagram
కిరణ్ రాథోడ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
Bekyk hierdie plasing op Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




